Prabhas looking for endorsements

Prabhas Looking For endorsements, hero prabhas corporate endorsements, telugu film hero in brand ambassador, prabhas looking for side income, tollywood hero prabhas

Prabhas Looking For endorsements, hero prabhas corporate endorsements, telugu film hero in brand ambassador, prabhas looking for side income, tollywood hero prabhas

సైడ్ ఇన్ కమ్ పై కన్నేసిన ప్రభాస్

Posted: 05/27/2014 05:36 PM IST
Prabhas looking for endorsements

సినిమా హీరో, హీరోయిన్లకు ఎంత ఆదాయం వచ్చినా సరిపోదు. దాంతో సైడ్ ఇన్ కమ్ కోసం హీరో, హీరోయిన్లు చాలా బిజినెస్ లు చేయడమే కాకుండా, షాపింగ్ ఓపెనింగులని, కమర్షియల్ యాడ్స్ అని ఇలా రకరకాలుగా నాలుగు రాళ్ళు సంపాదిస్తారు. ఇలాంటి వాటికి మన తెలుగు హీరోలు కూడా ఏం తీసిపోరు. ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోలు అయిన నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్ అల్లు అర్జున్ లాంటి వారు ఇప్పటికే ప్రముఖ బ్రాండ్ లకు ప్రచారం చేస్తున్నారు.

ఇప్పుడు ఆ జాబితాలోకి యంగ్ రెబల్ స్టార్ కూడా చేరబోతున్నాడు. ఇప్పటి వరకు కేవలం సినిమాల్లోనే నటించిన ప్రభాస్ ఇక పై ప్రముఖ బ్రాండ్ లకు కూడా ప్రచారం చేయడాలని డిసైడ్ అయ్యాడు. యూత్ లో, అమ్మాయిల్లో ఈయనకున్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ఇప్పటికే కొన్ని సంస్థలు అప్రోచ్ అవుతున్నట్టు సమాచారం. ఇటీవల ఓ టూత్ పేస్ట్ కంపెనీ కూడా అప్రోచ్ అయిందనీ, అయితే డీల్ ఓకే కాలేదనీ అంటున్నారు.

త్వరలోనే మంచి ప్రాడక్ట్ తో, ఎండార్స్ మెంట్ చేయనున్నట్టు సమాచారం. సంవత్సరాలు సంవత్సరాలు ఒకే సినిమాలకు కమీట్ అయ్యినందున ఆదాయం తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడని టాలీవుడ్ లో కొంత మంది జనాలు అంటుంటే... మరి కొందరు మాత్రం త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్న ప్రభాస్ మరింత సంపాదన అవసరం కాబట్టి యాడ్స్ పై ద్రుష్టి పెట్టాడని అంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles