Raj tarun in dil raju kerintha moive

Uyyala Jampala fame Raj Tarun, Raj Tarun bags dil raju banner, Raj Tarun,Raj Tarun movies,Raj Tarun latest movies

producer Dil Raju has given call for Uyyala Jampala fame Raj Tarun in his upcoming film Kerintha.

దిల్ ‘రాజు ’ కొడుకును తొక్కేశాడా ?

Posted: 05/28/2014 03:07 PM IST
Raj tarun in dil raju kerintha moive

టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు బ్యానర్లో చిన్న హీరోలకు అవకాశం వస్తే చాలా లక్కీగా ఫీలవుతారు. కానీ రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేముంది అనే సామెత మాదిరి దిల్ రాజు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు ? ఏ హీరోనైనా తప్పిస్తాడు ? ఏ హీరోనైనా పెట్టుకుంటాడు ? కావాలంటే తన తోటి దర్శక నిర్మాతల కొడుకుల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తాడు ?

ఇక్కడ విషయం ఏంటంటే ప్రముఖ దర్శక నిర్మాత అయిన ఎం.ఎస్. రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా తన బ్యానర్లో తక్కువ బడ్జెట్ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. సాయికిరణ్ అడవిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చేయబోయే ఈ సినిమాలో నుండి సుమంత్ అశ్విన్ ని పీకేసి ‘ఉయ్యాల జంపాల ’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన కుర్రాడు రాజ్ తరుణ్ ని తీసుకున్నాడు. 

ఈ సినిమాకు ‘కేరింత ’ అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తాడు. మొదటి నుండి అనుకున్న సుమంత్ అశ్విన్ ని తప్పించి, తాజాగా రాజ్ తరుణ్ తీసుకోవడం చూస్తుంటే రాజు కొడుకునే తొక్కేసే ప్రయత్నంలో భాగమే అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles