Manam first weekend collections

Manam first weekend collections, manam box office, telugu box office, akkineni nageswara rao, nagarjuna, naga chaitanya, vikram kumar

Akkineni Nageswara Rao, Nagarjuna, Naga Chaitanya film Manam has ended first weekend collection At worldwide Box Office.

‘మనం ’ కోట్లు కొల్లగొడుతుంది

Posted: 05/27/2014 04:39 PM IST
Manam first weekend collections

అక్కినేని ఫ్యామిలీలో మూడు తరాలకు చెందిన హీరోలు కలిసి నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మనం ’ చిత్రం సూపర్ హిట్ అనే టాక్ తెచ్చుకోవడంతో ఆ సినిమాకు స్వదేశంలో, విదేశాల్లో కాసుల వర్షం కురుస్తోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లో ఇక్కడ 7 కోట్ల వసూళ్ళు సాధించిన ఈ సినిమా విదేశాల్లో దాదాపు 5 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లు సమాచారం.

చాలా రోజుల తరువాత తెలుగు తెర పై మంచి సినిమా రావడం, అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం కావడంతో చాలా కాలం నుండి సినిమాలు చూడటం మానేసిన ప్రవాస భారతీయులు కూడా థియేటర్ల ముందు క్యూ కట్టడంతో తొలి మూడు రోజుల్లో దాదాపు తెలుగులో వచ్చినన్ని వసూళ్ళు అక్కడ వచ్చాయి. ఇదే కలెక్షన్ల జోరు ఈ వారం చివరి వరకు కొనసాగితే మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరడం ఖాయం అంటున్నారు వ్యాపార విశ్లేషకులు.

మొత్తంగా ఈ సినిమా విజయం పై నాగార్జున ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles