Nithin karunakaran movie launched

nithin karunakaran movie opening, nithin karunakaran movie launched, nithin new movie launched, mishti chakraborty pair up with nithin, mishti chakraborty, telugu actor nithin, karunakaran new telugu movie, telugu movie news, nithin mishti chakraborty movie news,

nithin karunakaran movie opening, nithin karunakaran movie launched, nithin new movie launched, mishti chakraborty pair up with nithin, mishti chakraborty, telugu actor nithin, karunakaran new telugu movie, telugu movie news, nithin mishti chakraborty movie news,

పిల్ల దొరికింది... ముహూర్తం మొదలెట్టాడు

Posted: 05/21/2014 04:11 PM IST
Nithin karunakaran movie launched

పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘‘తొలిప్రేమ’’ లాంటి సినిమాలో నటించాలని హీరో నితిన్ ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. అందుకే ఆ చిత్ర దర్శకుడు కరుణాకరణ్ తో కలిసి తొలిప్రేమ తరహాలో ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ మంచి కథ కోసం ఎదురు చూస్తున్న ఈ కుర్రాడికి కరుణాకరణ్ ఓ మంచి కథను సిద్ధం చేశాడు. అన్ని బాగానే కుదిరాయి కానీ.. ఇలాంటి సినిమాలకు జనాలను ఆకర్షించే అందమైన అమ్మాయి కావాలి. అలాంటి అందమైన అమ్మాయి కోసం వెతికిన నితిన్, కరుణాకరణ్ లకు మిష్తీ దొరికింది.

హిందీలో నటించిన మొదటి చిత్రం ‘కాంచి’. ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. దాంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో ఈ అమ్మడికి ఇదే మొదటి సినిమా. తమ సినిమాకు కావలసిన అందమైన అమ్మాయి దొరికిందని భావించిన నితిన్ కొత్త చిత్ర యూనిట్ సినిమా నేడు ముహూర్త కార్యక్రమాలు ప్రారంభించేసారు. విక్రమ్ గౌడ్ సమర్పణలో, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్లో నిర్మాత నిఖితా రెడ్డి, సుధాకర్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.

నిర్మాత నిఖితా మాట్లాడుతూ... జూన్ 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక్కడే కాకుండా అబ్రాడ్ లో కూడా షూటింగ్ జరుపనున్నాం. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం మా బ్యానర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం అవుతుందని తెలిపారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నాడు.

 

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles