Abhishek aishwarya rai split rumours

Aishwarya rai Bachchan,abhishek bachchan,Refutes,Divorce Rumours,marriage,Breakup,Cannes Film Festival 2014

Actor Abhishek Bachchan has rubbished rumours that he and his wife Aishwarya Rai Bachchan are heading for divorce.

ఐష్ - అభిషేక్ విడిపోతున్నారా ?

Posted: 05/17/2014 09:38 PM IST
Abhishek aishwarya rai split rumours

బాలీవుడ్ లో హాట్ అండ్ రొమాంటిక్ కపుల్ గా పేరొందిన అందాల సుందరి ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ ల పై ఎప్పుడు ఏదో ఒక రూమర్ ఫిలిం వర్గాల్లో సంచరిస్తూనే ఉంటుంది. గతంలో ఈమె బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తుందని, ఐశ్వర్య మళ్లీ గర్భం దాల్చిందని ఇలా రకరకాల కథనాలు వచ్చాయి. అవన్నీ రూమర్లు అని తేలడంతో ఆ వార్తలకు బ్రేకులు పడ్డాయి.

కానీ ఈసారి మ్యారేజ్ లైఫ్ పై రూమర్లు వినిపిస్తున్నాయి. ఐష్ భర్త అభిషేక్‌ నుంచి విడాకులు తీసుకుంటోందని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అత్త జయాబచ్చన్‌తో ఐష్‌కు పడడంలేదని, తనకు స్వేచ్ఛను ఇవ్వకుండా ఆమె రూల్స్ పెడుతోందని అందుకే ఐష్, అభిషేక్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకుందని బాలీవుడ్ లో  జనాలు కోడై కూస్తున్నారు.

ఈ విషయంలో నిజమెంతో అని అభిషేక్ ని అడగ్గా.... ఓహో... అలాగా ... ఈ విషయం నాకు తెలిపినందుకు థ్యాంక్స్. మళ్లీ పెళ్ళెప్పుడు చేసుకుంటానో కూడా నాకు చెప్పండి మరి అంటూ జోక్స్ కూడా వేస్తున్నాడు. మీదికి ఇలా మాట్లాడినా తీరా విడిపోయాక ఓ స్టేట్ మెంట్ ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదేమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles