Ss rajamouli lauds pawan kalyan

Director Rajamouli, TDP-BJP combine, Pawan Kalyan decision, Rajamouli,Pawan Kalyan,NDA

filmmaker rajjamouli reckons that Pawan Kalyan's decision to not contest in the elections played a decisive role in the outcome of the elections.

పవన్ పై జక్కన్న ప్రశంసల జల్లు

Posted: 05/17/2014 09:41 PM IST
Ss rajamouli lauds pawan kalyan

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్ని తాత్కాలికంగా ప్రక్కన పెట్టి, సొంతగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని, దేశంలో ఉన్న అవినీతి ప్రభుత్వాలను తరిమికొట్టాలనే ఉద్దేశ్యంతో సమర్థ పాలన అందించే నాయకులకు ఎన్నుకోవాలని భాజాపా-తెదేపా కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా, ఆ పార్టీ గెలుపు కోసం రెండు రాష్ట్రాల్లో విస్త్రుత ప్రచారం చేసి సీమాంధ్రలో తెదేపా-భాజాపా కూటమికి విజయాన్ని అందించడమే కాకుండా, తెలంగాణ లో కూడా ఈ కూటమి మెరుగైన స్థానాలు గెల్చుకోవడంలో కీలకపాత్ర పోషించడంతో ఫలితాలు వెలువడిన తరువాత ఆయన పై జాతీయ నేతల నుండి సినిమా దర్శకుల వరకు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రశంసలు గుప్పించారు. ‘ఒక వేళ ఎన్నికల ఫలితాలు అనుకున్న విధంగా రాక పోతే భవిష్యత్‌లో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్‌కు ముందే తెలుసు. కానీ ఆయన వాటిని వాటికి ప‌వ‌న్ భ‌య‌ప‌డ‌లేదని, తాను నమ్మిన విధానాలతోనే ముందుకు సాగారని, టీడీపీ-బీజేపీ కూటమిని గెలిపించడానికే ఎన్నికలకు దూరంగా ఉండటం అనేది చరిత్రలో నిలిచిపోయే అంశం అన్నారు.

ఇక తాను సమర్థించిన పార్టీ లోక సత్తా ఓటమి పై కూడా స్పందిస్తూ... డ‌బ్బు వెద‌జ‌ల్లిన పార్టీల బ‌లం ముందు లోక్ స‌త్తా నిల‌బ‌డి ల‌క్షా డ‌భై వేల ఓట్లు సంపాదించుకోగ‌లిగింద‌ని, ఆ పార్టీ పై ప్రజలకు విశ్వాసం ఉందని అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని రెండు కొత్త ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకుంటాయని ఆశిస్తున్నట్లు రాజమౌళి వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles