Pawan kalyan as krishna in oh my god telugu version

Pawan Kalyan as Krishna in Oh My God Telugu version, Pawan Kalyan Venkatesh combination moive, Telugu remake of Oh My God to start on May 19, Pawan Kalyan Venkatesh multi starer movie

Pawan Kalyan as Krishna in Oh My God Telugu version

కృష్ణుడి పాత్రలో పవన్ కళ్యాణ్!

Posted: 05/10/2014 11:40 AM IST
Pawan kalyan as krishna in oh my god telugu version

పవన్ కళ్యాణ్ వెంకటేష్ ల కాంబినేషన్ తో ఎప్పుడో మొదలవవలసిన హిందీ సినిమా ఓ మై గాడ్ తెలుగు రూపాంతరం పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం వలన, రాష్ట్రంలో ఎన్నికల జోరు వలన, ఇంతవరకు ప్రారంభం కాకుండా ఆగిపోయింది.  చివరకు ఎన్నికల సమరమంతా సమసిపోవటంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ ప్రాజెక్ట్ కి పచ్చజెండా ఊపినట్లుగా తెలుస్తోంది.  అందువలన ఈ సినిమా మే 19 నుంచి తో చిత్రీకరణకు నోచుకుంటోంది.  

హిందీ చిత్రం ఓ మై గాడ్ లో అక్షయ్ కుమార్ పోషించిన కృష్ణుడి పాత్రలో పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ నటించిన దుకాణదారుడి పాత్రలో వెంకటేష్ ప్రేక్షకులను అలరించబోతున్నారు.  మరి కృష్ణుడి పాత్ర కోసం పవన్ కళ్యాణ్ మీసాలు తేసేస్తారా అన్న ప్రశ్న ఉదయించింది.  ఎందుకంటే మన సినిమాల్లో కృష్ణుడికి మీసాలుండవు.  కానీ ఒరిజినల్ హిందీ సినిమాలో అక్షయ కుమార్ ఆధునిక వేషంలో ఉన్న కృష్ణుడే కాబట్టి ప్రత్యేకంగా ఎటువంటి మార్పులూ చేసుకోవలసిన అవసరం లేదని చెప్పారు. 

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో మల్టీస్టారర్ చిత్రాలకు శ్రీకారం చుట్టిన వెంకటేశ్ ఆ తర్వాత రామ్ తో హిందీ సినిమా తెలుగు రిమేక్ లో చేసారు.  అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డా, పవన్ కళ్యాణ్ తో కాంబినేషన్ అంటే ఆ విషయమే వేరు కాబట్టి వెంకటేష్ ఇంతకాలం ఓపిగ్గా ఎదురు చూస్తూవున్నారు.  చివరకు ఆ రోజు కాస్తా వచ్చేటప్పటికి చిత్ర బృందం చకచకా అంతా సిద్ధం చేసుకుంటోంది.  

శరత్ మరార్, దగ్గుబాటి సురేష్ బాబు సమిష్టిగా నిర్మిస్తున్న ఈ చిత్ర వివరాలను పవన్ కళ్యాణ్ మిత్రుడు శరత్ మరార్ స్వయంగా వెల్లడించారు.  ఈ చిత్రాన్ని సెప్టెంబర్ కల్లా విడుదల చెయ్యాలని కూడా అనుకుంటున్నట్లుగా నిర్మాతలు తెలియజేసారు.   అయితే ఇంకా ఇతర నటీనటుల ఎంపిక పూర్తవలేదు.  ఇతర వివరాలను త్వరలో తెలియజేస్తామంటున్నారు.  సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉండేట్టుగా ఉంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles