Nayanthra patches up with ex lover simbu

Nayanthra Patches up with Simbu, Simbu and Nayanthara,simbu,nayanthara, Simbu-nayantara pics Trisha Birthday, Simbu-nayantara at Trisha Birthday, Trisha birthday party 2014,Simbhu-Hansika break up,Simbu-nayantara pictures appeared in media, Simbu-nayantara

Simbu and Nayantara along with others partying at Trisha birthday have been leaked.

మళ్లీ పాత లవరే దిక్కయ్యాడు ??

Posted: 05/09/2014 07:09 PM IST
Nayanthra patches up with ex lover simbu

ఏ మొగుడు దిక్కు లేక పోతే అక్క మొగుడే దిక్కు అన్నట్లు అందాల సుందరి నయనతార ఎంతమంది లవర్లను మెయింటేన్ చేసి వదిలేసినా, చివరకు తాను మొదట ప్రేమించిన వాడికే దగ్గరయ్యిందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం కోలీవుడ్ లో హాట్ లవ్ బర్డ్స్ గా చెలామణి అవ్వడమే కాకుండా, లిప్ లాక్ కిస్సులులకు సంబంధించిన ఫోటోలు వదిలిన లిటిల్ సూపర్ స్టార్ శింబు, నయనతారలు తరువాత విడిపోయి, శింబు హన్సికతో ప్రేమలో పడితే, నయనతార ప్రభుదేవాతో ప్రేమలో పడి పెళ్ళి కూడా చేసుకోవడానికి అంతా సిద్దం అయిన టైంలో బ్రేకప్ అయ్యారు.

శింబు కూడ గత కొన్ని నెలల క్రితమే హన్సికకు బ్రేకప్ చెప్పాడు. అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న నయనతార, శింబుల మధ్య మళ్ళీ ప్రేమ చిగురించిందని అంటున్నారు. గతంలో వీరిద్దరి పై ఎన్నో రూమర్లు వచ్చినా ఈసారి మాత్రం వీరి మధ్య ప్రేమ పుట్టిందనడానికి కొన్ని ఫోటో సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు. (స్టైడ్ షో) లో చూడవచ్చు. ఈనెల 4వ తారీఖున చెన్నై చంద్రం త్రిష తన 31వ బర్త్ డే వేడుకకు చాలా గ్రాండ్ గా జరుపుకుంది. ఈ వేడుకకు త్రిష సన్నిహితుల్ని, బెస్ట్ ఫ్రెండ్స్ ని పిలిచి రాత్రంతా ఎంజాయ్ చేశారు.

త్రిషకు బెస్ట్ ఫ్రెండ్ అయిన నయనతార, అమలా పాల్, సబినా ఖాన్, ప్రియా మనికంటన్, సోనియా అగర్వాల్, రమ్యకృష్ణ తదితరులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన పార్టీ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి తెగ ఎంజాయ్ చేశాం అంటూ త్రిష ట్వీట్ కూడా చేసింది. తాజాగా ఈ పార్టీకి తమిళ నటుడు, నయనతార మాజీ ప్రియుడైన శింబు కూడా హాజరైన ఫోటో వెలుగులో రావడం, అందులో నయన మాజీ ప్రియుడితో కలిసి పార్టీ ఎంజాయ్ చేయడం చూస్తుంటే వీరిద్దరి మధ్య మళ్ళీ ప్రేమ పుట్టిందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలంటున్నారు కోలీవుడ్ జనాలు. మళ్ళీ చిగురించిన ప్రేమ పెళ్లి వరకు వెళుతుందా ? లేక మళ్లీ మూణ్ణాళ్ళ ముచ్చటే అవుతుందా ? వేచి చూద్దాం.

ప్రతి భర్త తన భార్య సీత లాంటిది కావాలని కోరుకుంటాడు. అలాంటి సీత పాత్రను శ్రీరామరాజ్యంలో పోషించిన నయనతార ఇలా పూటకో మొగుడ్ని మారుస్తూ తాను పోషించిన పాత్రకు అర్థం లేకుండా చేస్తుందని అంటున్నారు సినీజనాలు.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/nayan-shimbu

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles