Pawan kalyan film career in dilemma

pawan kalyan film career in dilemma, Pawan Kalyan in Gabbar Singh 2, pawan in Oh My god remake, Pawan Kalyan on Gabbar Singh 2, Hero Pawan Kalyan on Gabbar Singh 2

pawan kalyan film career in dilemma, Pawan Kalyan in Gabbar Singh 2, pawan in Oh My god remake

పవన్ పయనం ఎటు ?

Posted: 05/08/2014 08:45 PM IST
Pawan kalyan film career in dilemma

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి, నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రశ్నించడానికే తప్ప అధికారంకాదని చెప్పి, సినిమాలకు విరామం ఇచ్చి సాధారణ ఎన్నికలలో భాజాపా-తెదేపా కూటమి తరుపున ఎన్నికల్లో ప్రచారం చేసి అలసిపోయిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల తరువాత తెదేపా-భాజాపా కూటమి అధికారంలోకి వస్తే, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఏర్పాటైన ప్రభుత్వాలను ప్రశ్నిస్తాడా ? లేక తన వ్రుత్తి అయిన సినిమాల్లో మళ్లీ బిజీ అవుతాడా ? రాజకీయాల్లొ కొనసాగుతాడా ? అన్నది ఇండస్ట్రీలో తెగ చర్చించుకుంటున్నారు.

వాస్తవానికి పవన్ ‘గబ్బర్ సింగ్ -2 ’, ‘ఓ మై గాడ్ ’ సినిమాలకు కమీట్ అయ్యాడు. మొదట ‘ఓ మై గాడ్ ’ షూటింగులో పాల్గొంటానని మాట ఇచ్చాడు. బీజేపీ, టీడీపీ కూట‌మి సీమాంధ్రలో అధికారంలోని రాక‌పోతే తాను సినిమాలు మానేస్తాన‌ని, ప్రజా ఉద్యమంలో దిగుతాన‌ని ఇటీవలే తన ప్రచారంలో పవన్ చెప్పుకొచ్చారు. మరోవైపు పవన్ పాదయాత్ర అంటూ ఓ వైపు ప్రచారం సాగుతోంది. అయితే ఇక ఎన్నికలు ముగిశాయి కాబట్టి పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గబ్బర్ సింగ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles