Reasons behind kochadaiiyaan postponed

Kochadaiiyaan postponed reasons, rajinikanth, kochadaiiyaan, kochadaiyaan box office collections, kochadaiiyaan box office, deepika padukone.

Indian superstar Rajinikanth anticipated film Kochadaiiyaan has been postponed from its original release date of Friday, 9 May 2014.

విడుదల వాయిదాకు కారణం ఇదేనా ?

Posted: 05/08/2014 07:24 PM IST
Reasons behind kochadaiiyaan postponed

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కొచ్చాడయాన్ ’ సినిమా రేపు  (మే 9న) ప్రపంచ వ్యాప్తంగా ఆరు వేల థియేటర్లలో విడుదల చేస్తామని చెప్పిన చిత్ర యూనిట్ తీరా ఆ చిత్రాన్ని రెండు వారాల పాటు వాయిదా వేస్తూ మే 23వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. దీనికి కారణంగా ప్రింటను పంపడంలో సాంకేతిక లోపాలు తలెత్తాయని, దాని వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని కూడా వివరణ ఇచ్చారు.

వారు చెప్పిన కారణం ఎలా ఉన్నా కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న వార్తలు మాత్రం వేరేగా ఉన్నాయి. గత కొన్ని రోజుల క్రితం నిర్మాతలకు, డిస్టిబ్యూటర్లకు మధ్య ఆర్థిక పరమైన ప్రాబ్లమ్స్ వచ్చాయని వార్తలు వచ్చాయి. అప్పటి నుండి వీరి మధ్య అవే విభేధాలు కొనసాగుతుండటంతో ఈ సినిమాను వాయిదా వేశారని అనుకుంటున్నారు. ని

ర్మాతల సంఘం వద్ద కూడా వీరి సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ మేటర్ రజినీ దాక వెళ్లిందని, అది సద్దుమణిగితే కానీ ఈ సినిమా విడుదలవ్వడం కష్టం అంటున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది.

మొత్తం ఆరు భాషల్లో విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం టిక్కెట్లు ఇప్పటికే మల్లీప్లెక్సుల్లో పదమూడు వేల వరకు అమ్మడయ్యాయి. తీరా ఈ చిత్రం వాయిదా పడటంతో టిక్కెట్లు కొన్నవారు నిరాశ చెందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles