Navdeep cameo in rgv vishnu movie

Navdeep in Ram gopal varma movie, Ram Gopal Varma and Manchu Vishnu movie, Navadeep key role, 24 Frames factory banner.

Navdeep played a cameo in Ram Gopal Varma and Manchu Vishnu up comming movie.

రామ్ గోపాల్ వర్మ తో బ్యాచ్ లో యంగ్ హీరో

Posted: 04/25/2014 07:34 PM IST
Navdeep cameo in rgv vishnu movie

ఇటీవలి కాలంలో రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ ని వదిలి టాలీవుడ్ పై పడ్డాడు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా మంచు ఫ్యామిలీతో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఇటీవలే మోహన్ బాబును నేచురల్ లుక్ బట్టతలతో ‘రౌడీ ’ గా చూపించాడు. ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకున్నా పట్టించుకోకుండా హీరో రాజశేఖర్ ని ఢిఫరెంట్ లుక్ లో చూపిస్తూ ‘పట్టపగలు ’ బయపెట్టడానికి సిద్దం అయ్యాడు.

ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వడంతో మంచు విష్ణుతో ఓ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమా కూడా సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో విష్ణుతో పాటు యంగ్ హీరో నవదీప్ కూడా నటించబోతున్నాడట. ఇందులో ఆయన కీ రోల్ ప్లే చేశాడట. పాత్ర నిడివి చిన్నదైనప్పటికీ స్టొరీ తో ముడిపడిన బలమైన పాత్ర అవుతుందని అంటున్నాడు నవదీప్.

ఇప్పటికే నవదీప్ పార్ట్ షూటింగ్ అయిపోయందట. అంతంత మాత్రంగా అవకాశాలతో నెట్టుకొస్తున్న నవదీప్ కి ఈ సినిమా తరువాత ఏమైనా అవకాశాలు పెరుగుతాయో చూడాలి. ఓ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి '13'అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. జూన్ చివరరి వారంలో చిత్రాన్ని థియేటర్లో కి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles