Rajini kochadaiyaan in financial trouble

Kochadaiiyaan release,Kochadaiiyaan release May 9, Murali Manohar, TN Film Distributors Association,

Superstar Kochadaiiyaan hit screens on May 9 as promised. Kollywood after rumours emerged that the film had hit a new roadblock in the form of a difference of opinion between one of its producers Murali Manohar and some distributors.

కొచ్చాడయాన్ కి ఆర్థిక కష్టాలు

Posted: 04/25/2014 12:14 PM IST
Rajini kochadaiyaan in financial trouble

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో నటించిన ‘కొచ్చాడయాన్ ’ సినిమా  మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీతాజాగా కోలీవుడ్ వర్గాల నుండి అందతున్న సమాచారం ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని అనుకుంటున్నారు.

కారణం ఈసినిమా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య నెలకొన్న ఫైనాన్షియల్ సెటిల్ మెంట్లే కారణం అని అంటున్నారు. ఈ విషయమై చర్చలు వాడివేడిగా జరుగుతున్నట్లు కోలీవుడ్ టాక్. వీటి పై స్పష్టత వచ్చేంత వరకు సినిమా విడుదల కాదని అంటుంటే... డిస్ట్రిబ్యూటర్స్ సంఘం కార్యదర్శి జయకుమార్ మాట్లాడుతూ భారీ చిత్రాల విడుదల సమయాల్లో థియేటర్ల టికెట్ల ధర ఎవరికెంత శాతం చెందాలన్న విషయాలపై చర్చ జరగడం సహజం అని, అంత మాత్రాన విడుదల వాయిదా పడుతుందని అనుకోవద్దని అన్నీ త్వరలోనే సర్థుకుంటాయని చెప్పారు.

సూపర్‌స్టార్ రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం కోచ్చడయాన్. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపిక పదుకునే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు కె ఎస్ రవికుమార్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించారు. మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డీ ఫార్మెట్‌లో రూపొందిన తొలి భారతీయ చిత్రం కోచ్చడయాన్. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల వాయిదా పై ఆ చిత్ర దర్శక నిర్మాతలు క్లారిటీ ఇచ్చే వరకు ఏ వార్తల్ని నమ్మడానికి లేదంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles