ఇటీవలి కాలంలో చాలామంది సింగర్లు, డబ్బింగ్ ఆర్టిస్టులు ప్రేమ వివాహాలే చేసుకుంటున్నారు. ఇప్పటికి చాలా మంది పెళ్ళి పీటలు ఎక్కగా, ఇప్పుడు మరో జంట మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. తన హస్కీ వాయిస్ తో ‘సమంతా ’కు డబ్బింగ్ చెప్పిన చిన్మయి, సినీ హిరో, ‘అందాల రాక్షసి ’ ఫేం రాహుల్ రవీంద్రన్ ని ప్రేమ వివాహం చేసుకోబోతుంది. గత కొంత కాలంగా ప్రేమికులుగా ఉన్న వీరు మే 6వ తేదీన చెన్నైయ్ లో ఒక్కటి కాబోతున్నారు.
డబ్బింగ్ ఆర్టిస్టుగానే కాకుండా, సింగర్ కూడా కూడా సుపరిచితం అయిన చిన్మయికి ఇండస్ట్రీలో మంచి పేరే వచ్చింది. బాలీవుడ్ లో ‘చెన్నైయ్ ఎక్స్ ప్రెస్ ’ సినిమాలో పాడిన పాట తో ఈ అమ్మడు పేరు అక్కడ కూడా మార్మోగిపోయింది. రాహుల్ తమిళ కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా, చిన్మయి తండ్రి ఆంధ్రుడు (సంగీత విద్వాంసులు శ్రీపాద పినాకపాణి తనయుడు), తల్లి తమిళియన్. వీరి కాపురం పదికాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకుందాం. అంతే కాదండోయ్ ... ఈ అమ్మడు పెళ్ళికి వెళ్ళే వారు గిఫ్టులు తీసుకెళ్ళకుండా, ఛారిటీ కోసం డబ్బులు తేవాలని కూడా రిక్వెస్ట్ చేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more