Prakash raj to be banned from tollywood industry

Prakash Raj, Telugu film directors association, TFDA, Prakash Raj to be banned from telugu, Aagadu movie.

Tollywood versatile actor Prakash Raj to be banned from Telugu Film Industry as he is not behaving properly with co artists.

టాలీవుడ్ నుండి తరిమేస్తున్నారు ?

Posted: 04/22/2014 07:17 PM IST
Prakash raj to be banned from tollywood industry

ఏ వ్యక్తి కి అయినా క్యారెక్టర్ ఇంపార్టెంట్. మనం ప్రక్కవాళ్లతో ఎంత బాగా ప్రవర్తిస్తే వారు మనతో అంత బాగుంటారు. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే సమాజంలో గౌరవ మర్యాలు పెరుగుతాయి. ఈ విషయం మనిషన్న ప్రతి వాడికి తెలియాలి. అది తెలుసుకోక పోతే వాడు మనిషే కాదు.

కానీ కొంత మంది సినీ నటులు గర్వంతో ఇతరుల పట్ల జులుం ప్రదర్శిస్తారు. అలా ప్రవర్తించి సినీ కెరియర్ నే కాకుండా, నలుగురిలో చెడ్డవాళ్ళుగా మిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఆ కోవలోకి ప్రకాష్ రాజ్ వచ్చి చేరాడు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ప్రకాష్ రాజ్ గురించి చెడ్డగానే చెబుతారు కానీ మంచిగా చెప్పేవారు తక్కువే. కారణం ఆయన ప్రవర్తనే. ప్రకాష్ రాజ్ నటుడిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో, అంతటి గర్విగా కూడా పేరు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు ఇదే అతడి కెరియర్ పై ఎఫెక్ట్ పడబోతుంది. ఇటీవల ఆయన శీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆగడు ’ సినిమా షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ సభ్యుల పై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, చేయి కూడా చేసుకోవడంతో ఆయన్ను సినిమా నుండి తప్పించి, సోనూ సూద్ ని తీసుకున్నారు. ఇతను దాడి చేసిన వ్యక్తులు దర్శకత్వ శాఖలో ఫిర్యాదు చేయడంతో అతని పై చర్యలు తీసుకోడానికి సిద్దమయ్యారు.

అంటే ప్రకాష్ రాజ్ ని టాలీవుడ్ నుండి తరిమేస్తారన్న మాట. గతంలో కూడా ఇతన్ని కొన్ని రోజులు బ్యాన్ చేసి మళ్ళీ తీసుకున్నారు. ఈసారి మాత్రం అలాంటిది ఏమీ ఉండదని, ప్రకాష్ రాజ్ చాప్టర్ టాలీవుడ్ లో క్లోజ్ అని అంటున్నారు.

KNR

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles