Nara rohit pratinidhi release on april 25th

Nara Rohit Pratinidhi movie, Pratinidhi release April 25th, Nara Rohith Pratinidhi movie, Prathinidhi movie release april 25th, Shubhra heroine Ayyappa, hero nara rohit, Prashanth director, producer Sambasiva Rao.

Nara Rohit Pratinidhi release on April 25th, Nara Rohith Pratinidhi movie, Prathinidhi movie release april 25th, Shubhra heroine Ayyappa, hero nara rohit, Prashanth director, producer Sambasiva Rao.

‘ప్రతినిధి ’ ఎట్టకేలకు వస్తున్నాడు

Posted: 04/12/2014 09:54 AM IST
Nara rohit pratinidhi release on april 25th

నారా రోహిత్ నటించిన ‘ప్రతినిథి ’ సినిమాకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకొని, నవంబర్ లోనే ఆడియో కూడా విడుదల అయిన ఈ సినిమా ఇంత కాలం ఆర్థిక కారణాల వల్ల విడుదల కాకుండా ల్యాబ్ లోనే ఉండింది. ఇటీవలి కాలంలోనే ఆర్థిక కష్టాల నుండి బయటపడిన ఈ చిత్ర నిర్మాత ఈ సినిమాను ఈనెల 25వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రాజకీయ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో సమకాలీన రాజకీయాలను చూపించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ లో రాజకీయాల పై పంచ్ డైలాగులు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. సినిమాలోని కొన్ని అంశాలు ప్రేక్షకులపై ప్రభావం చూపి ఓటర్లలో మార్పు తీసుకొచ్చే అవకాశముందంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

ఈ చిత్రానికి ప్రశాంత్ మండవ దర్శకత్వం వహించగా, రోహిత్ సరసన శుబ్ర అయ్యప్ప హీరోయిన్ గా , సాంబశివరావు నిర్మించారు. సాధారణ ఎన్నికల ముందు విడుదల అవుతున్న ఈ చిత్రం ఏమైనా సంచలనాలు స్రుష్టిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles