Sampoornesh babu to romance 7 heroines

Sampoornesh Babu, romance 7 heroines, Kobbari Matta, Hrudaya Kaleyam, Sampoo, Steven Shanker, Sai Rajesh, Paparayudu, Pedarayudu and Hyndrayudu

Sampoornesh Babu to romance 7 heroines in Kobbari Matta.

సంపూబాబు ఏడుగురితో రొమాన్స్

Posted: 04/09/2014 08:57 PM IST
Sampoornesh babu to romance 7 heroines

టాలీవుడ్ లో ‘హృదయకాలేయం ’ సినిమాతో స్టార్ హీరో క్రేజ్ తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు (ఆలియాస్ సంపూ) కి ఫ్యాన్స్ అప్పుడే ‘బర్నింగ్ స్టార్ ’ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఆ సినిమా హిట్టు తో సంపూ బాబు తరువాతి సినిమా ‘కొబ్బరి మట్ట ’ చేయడానికి రెడీ అవుతున్నాడు.  ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి పేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇందులో మనవాడి సరసన ఏకంగా ఏడుగురు కథానాయికలు నటిస్తారట.

అలాగే, ఈ సినిమాలో సంపు త్రిపాత్రాభినయం చేయబోతున్నాడు. ఈ సినిమాకు దీనికి 'ద లీవ్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మ్యాన్' అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు.  ఈ చిత్రాన్ని కూడా 'హృదయ కాలేయం' నిర్మాత సాయి రాజేష్ నిర్మిస్తారు. మూడు పాత్రలకు ఒక్కోదానిలో ఇద్దరు హీరోయిన్లు ఉండే విధంగా చూసుకుంటున్న సంపూబాబు సరసన నటించి తరించే ఆ కథానాయికల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles