Shruti hassan to pair up two movies with mahesh

Shruti Hassan, Mahesh babu, Mani Ratnam, Koratal Siva, UTV Motion Pictures, Mahesh, Shruti Haasan

Shruti Hassan two projects are, one in direction of Mani Ratnam and the second with Koratal Siva.

మహేష్ సరసన రెండు ఛాన్సులు కొట్టేసింది

Posted: 04/08/2014 10:49 AM IST
Shruti hassan to pair up two movies with mahesh

శృతి మించిన అందాలతో తెలుగు ప్రేక్షకుల్ని మత్తెక్కిస్తూ వరుస అవకాశాలతో దూసుపోతుంది శృతి హసన్. ఇప్పటికే కుర్ర స్టార్ హీరోలతో జత కట్టిన ఈ అమ్మడు మిగిలిన స్టార్ హీరో మహేష్ బాబుతో కలిసి నటింటడానికి సిద్దం అవ్వడమే కాదు ఏకంగా రెండు సినిమాల్లో నటించే ఛాన్స్ ని కూడా దక్కించుకున్నట్లు సినీ వర్గాల సమాచారం.

త్వరలో మిర్చి ఫేం కొరటాల శివ మహేష్ బాబుతో ఓ సినిమా ప్లాస్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రుతి హాసన్ అయితే బాగుంటుందని దర్శకుడు అభిప్రాయ పడగా, ఈ చిత్రాన్ని నిర్మించే యూటీవీ ఆమేరకు శ్రుతి హాసన్ తో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తుందట.

ఇప్పటి వరకు శ్రుతితో చేయని మహేష్ కూడా ఆమెతో చేయడానికి అసక్తిగా ఉండటంతో దాదాపు ఖరారు అయినట్లేనని అర్థం అవుతుంది. మ‌ణిర‌త్నం ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కనున్న ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ ఎంపికైంది. ఆ మేర‌కు ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జ‌రిపారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా ఓ కొలిక్కి వస్తే ఇందులో కూడా శ్రుతిహాసనే హీరోయిన్.

తెలుగులో మ‌హేష్‌బాబు స‌ర‌స‌న న‌టిస్తే చాల‌నుకొంటారు క‌థానాయిక‌లు. కానీ... శ్రుతికి మ‌హేష్‌తో ఏకంగా రెండు సినిమాల‌్లో నటించే ఛాన్స్ రావడంతో మిగతా వారు అసూయ పడుతున్నారు. మొత్తానికి శ్రుతిహాసన్ చాలా లక్కీ గర్ల్ కదా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles