Rgv rowdy movie promo at hyderabad

RGV Rowdy movie promotional program at Hyderabad, Director Ram Gopal Varma, Mohan Babu, Manchu Vishnu, Rayalaseema faction background in Rowdy movie, Rowdy movie gets A certificate

RGV Rowdy movie promotional program at Hyderabad

పది నిమిషాల రౌడీ మల్లిఖార్జున థియేటర్ లో

Posted: 04/02/2014 11:38 AM IST
Rgv rowdy movie promo at hyderabad

విశాఖపట్నంలో హల్ చల్ చేసినట్లుగానే రౌడీ సినిమా పది నిమిషాల ప్రొమో మంగళవారం మల్లిఖార్జున థియేటర్లో మోహన్ బాబు, విష్ణు సమక్షంలో అభిమానులకు ఆనందాన్ని పంచింది.  కేరింతలతో సినిమా హాల్ మారమోగిపోయింది.

ఇంతవరకూ చూడని విభిన్న పాత్రలలో మోహన్ బాబు, విష్ణుల తో రామ్ గోపాల్ వర్మ రూపొందించిన పూర్తి యాక్షన్ చిత్రం రౌడీ ఏప్రిల్ 4 న విడుదలకు సిద్ధమైంది. 

ఊహించినట్లుగానే ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ నుంచి A సర్టిఫికేట్ వచ్చింది. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో సాగిన చిత్ర నిర్మాణానికి ఆమాత్రం A సర్టిఫికేట్ రావటంలో కొత్తదనమేమీ లేదు కానీ, మొదటి సారి రామ్ గోపాల్ వర్మ సీనియర్ నటునితో సినిమా నిర్మాణం చెయ్యటం మాత్రం కొత్తదనాన్ని సంతరించుకుంది.  దానికి తగ్గట్టుగానే మోహన్ బాబు, విష్ణులను కొత్త అవతారాలలో చూపించారని చిత్ర బృందం చెప్తోంది.

ఈ సినిమాలో మోహన్ బాబు మేకప్ లేకుండా నటించటానికి అంగీకరించటం విశేషం.  జయసుధ, శాన్వీలు మోహన్ బాబు విష్ణులకు జంటగా నటించారు.  చిత్రంలో సంగీతం సాయి కార్తిక్ అందించగా, నిర్మాణం 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఎవి పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా చేసాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles