Hero turned villain jagapati babu

hero turned villain jagapati babu, Villain turned hero Gopichand, actor Jagapati Babu, Actor Gopichand, Comedian Sunil

Hero turned villain jagapati babu in Legend movie

నాయక్ నహీఁ ఖల్ నాయక్ హుఁ మై

Posted: 04/02/2014 12:50 PM IST
Hero turned villain jagapati babu

ఎన్నో కుటుంబ కథా చిత్రాలలోను, కొన్ని యాక్షన్ సినిమాలలోను కథానాయకుడిగా నటించి రాణించిన జగపతిబాబు హీరోగా డిమాండ్ తగ్గిపోవటంతో విలన్ గా సెటిల్ అవటానికి తయారై బాలకృష్ణ లెజెండ్ సినిమాలో ప్రతినాయకుడిగా నటించి ఆ సినిమాలోనూ రాణించటంతో గోపీచంద్ మీమాంసలో పడ్డట్టుగా కనపడుతోంది. 

ఎందుకంటే అందుకు వ్యతిరేక దిశలో ప్రతినాయకుడిగా పేరు, గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ ఆ తర్వాత కధానాయకుడి అవతారమెత్తటంతో ఆయనకి అవకాశాలు సన్నగిల్లిపోయాయి.  పోనీ మరోసారి విలన్ గానే మారుదామా లేకపోతే హీరోగానే అవకాశాల కోసం ఎదురు చూద్దామా అన్న మీమాంస ఇప్పుడు గోపీచంద్ ని పట్టుకుంది.

ఎంత అదృష్టం మీద ఆధారపడ్డా, సరైన నిర్ణయం తీసుకోకపోతే వెనకబడిపోతామేమో అనే వేదన కూడా సినిమా పరిశ్రమలో వేధిస్తుంటుంది. 

సునీల్ విషయంలో కూడా హీరోగా మారేటప్పటికి హాస్య పాత్రలు కరువైపోయాయి. 

అయితే హీరో పాత్రకు వచ్చే పారితోషికం వేరు కదా.  అందువలన 15 సినిమాల బదులు ఒక్క సినిమాలో ప్రధాన పాత్రలో మెప్పించగలిగితే దాని ప్రభావమే వేరుగా ఉంటుందన్నది మరో ఆలోచన.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles