Balakrishna legend new record

balakrishna, Balakrishna Legend, Balakrishna Legend movie, Legend movie, Legend movie new record, Legend First Day Collections, Nandamuri Balakrishna, Balakrishna fined Rs.10,000.

balakrishna legend new record

బాలకృష్ణ కొత్త రికార్డ్

Posted: 03/29/2014 07:58 PM IST
Balakrishna legend new record

టాలీవుడ్ లో  లెజెండ్ హల్ చల్  చేస్తుంది. దీంతో నందమూరి నటసింహం  బాలకృష్ణ  చాలా ఆనందంలో ఉన్నట్లు తెలుస్తోంది. లెజెండ్‌.. తన ఉడుకూ, దుడుకూ చూపిస్తున్నాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన బాలకృష్ణ లెజెండ్... అనుకొన్నట్టుగానే దుమ్ము దులుపుతున్నాడు. 

తొలి రోజు థియేట‌ర్ల‌న్నీ కిక్కిరిసిపోయాయి. ఫ‌లితంగా రికార్డుల మోత మోగింది. బాల‌కృష్ణ కెరీయ‌ర్‌లో ఎన్నడూ లేన‌న్ని వ‌సూళ్లు ద‌క్కాయి. తొలి రోజు దాదాపుగా రూ.ప‌దికోట్లు వ‌సూలు చేసిన‌ట్టు అంచ‌నా. 

ఆంధ్రా, సీడెడ్‌, నైజాంల‌లో రూ.7.20 కోట్లు వ‌సూలు చేసింది. ఓవ‌ర్సీస్‌లో రూ.70 ల‌క్షల వ‌ర‌కూ గిట్టుబాటు అయ్యింది. మిగిలిన రాష్ట్ర్రాల‌లో కోటిన్నర దాటింది. మొత్తానికి ప‌ది కోట్ల మార్క్‌కి అటూ ఇటుగా... లెక్కతేలింది. శ‌ని, ఆదివారాలు ఇదే జోరుకొన‌సాగే అవ‌కాశాలున్నాయి. 

సోమ‌వారం ఉగాది. ఆ రోజూ థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడ‌డం ఖాయం. అంటే వ‌రుస‌గా 4 రోజుల‌న్నమాట‌. ఈ నాలుగు రోజులూ లెజెండ్ జోరు ఇలాగే కొన‌సాగితే... లెజెండ్ బాక్సాఫీసు ద‌గ్గర స‌రికొత్త రికార్డ్ సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles