Charmi 50th film is prathighatana movie

Charmi, tollywood heroine charmi, Charmi 50th Film, Pratighatana Audio Release, Prathighatana movie.

Charmi 50th Film is Prathighatana movie

50లో పడిన ఛార్మీ

Posted: 03/29/2014 07:26 PM IST
Charmi 50th film is prathighatana movie

టాలీవుడ్ ఛార్మీ 50లో పడింది. దీంతో  ఆమె ఆనందం అంతా ఇంతా కాదు.  ఇప్పటి వరకు టాలీవుడ్ లో  50దాక వచ్చిన హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటిది  అందాల ఛార్మీ ఈ రికార్డు దక్కించుకంది. ఇక హీరోయిన్స్ అయితే రోజుకో హీరోయిన్ వచ్చేస్తుంది. ఒకటి లేదా రెండు సినిమాలకే తట్టాబుట్ట సర్దేసుకుంటున్న ఈ కాలంలో ఏకంగా అర్ధ సెంచరీ పూర్తి చేసిన హీరోయిన్స్ చాలా అరుదుగా దొరుకుతారేమో.

అయితే భారీ అందాల సుందరి ఛార్మీ మాత్రం హాఫ్ సెంచరీ కొట్టేయబోతుంది. హీరోయిన్ కానీ ఐటెం పాటలు కానీ స్పెషల్ పాత్రలు కానీ ఏదైనా ఛార్మీ ప్రస్తుతానికి 49 సినిమాలను పూర్తిచేసి ప్రతిఘటన సినిమాతో హాఫ్ సెంచరీ కొట్టేస్తుంది. ప్రస్తుతం అమ్మడి కెరియర్ డౌన్ లోనే ఉన్నా అడపాదడపా సినిమాలలో మెరుస్తానే ఉంది. అయితే భారీ బ్రేక్ ఇచ్చే సినిమాలు లేదన్నది నిజం.

ఛార్మీ ప్రస్తుతం తమ్మారెడ్డి భరద్వాజ్ దర్శకత్వంలో వస్తున్న ప్రతిఘటన మీద ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాను మొదట ఏప్రిల్ 4 న విడుదల చెయ్యడానికి ప్లాన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు సినిమా ఏప్రిల్ 18కి వాయిదా పడింది. 

దీనిపై ఛార్మీ ట్విట్టర్ పోస్ట్ చేసింది. అసలే కెరియర్ గ్రాఫ్ డౌన్ లో ఉండడం, దానికి తోడు యాభైవ సినిమా కావడంతో ఛార్మీ చాలా ఆశలే పెట్టుకుంది. మరి ప్రతిఘటన ఈ ఆశలను ఎంతవరకు నేరవేరుస్తుందో చూడాలి!

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles