Rowdy movie promotion in new style at vizag

Rowdy Movie, manchu family, manchu mohan babu, Rowdy Movie Promotion in vizag, Mohan Babu, Manch, Rowdy Movie Audio Release.

Rowdy Movie Promotion in New Style at Vizag

అర్థరాత్రి విశాఖలో మంచు హంగామా

Posted: 03/29/2014 07:07 PM IST
Rowdy movie promotion in new style at vizag

ఇదేంటి అసలే మార్చి నెల కావడంతో ఎండలు మండిపోతుంటే విశాఖలో మంచు ఎలా పడిందనకోవద్దు. విశాఖలో మంచు పడలేదు కానీ మంచు ఫ్యామిలీ సందడి చేసింది. విమాక్స్ థియేటర్లో ఆడియెన్స్, మీడియా ఇంటరాక్షన్ విత్ రౌడీ టీమ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చిత్ర కథానాయకుడు మంచు విష్ణు, చిత్ర దర్శకులు రాంగోపాల్ వర్మ సమాయత్తమవుతున్నారు. 

ఈ కార్యక్రమంలో మంచు విష్ణు-శాన్విలపై చిత్రీకరించిన నీ మీద ఒట్టు, సీమ లెక్క ఫుల్ సాంగ్స్ తో పాటు ఒక ఫైట్  సీక్వెన్స్ ను కూడా ప్రదర్శించనున్నారు. రెగ్యులర్ పంథాలో కాకుండా ఇలా కొత్తగా ప్రేక్షకుల వద్దకు సినిమా రిలీజ్ కు ముందే వచ్చి సినిమాకు పబ్లిసిటీ చేయడం బాలీవుడ్ లో మాత్రమే ఉంది. బహుశా వర్మనే మొదటి సారి ఈ తరహా పబ్లిసిటీని చేస్తున్నాడు.

సహజనటి జయసుధ చాలా కాలం తర్వాత మోహన్ బాబు సరసన నటిస్తున్న ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీతం అందించాడు. తాజాగా ఈ సినిమా ఆడియో విడుదలై శ్రోతలను ఆకట్టుకుంటోంది. సెన్సార్ సైతం పూర్తి చేసుకొని ఎ సర్టిఫికెట్ అందుకొన్నరౌడీ చిత్రాన్ని ఏప్రిల్ 4న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh