Janasena party chief pawan kalyan full buzz

pawan kalyan, janasena party Chief pawan kalyan, janasena party, jana sena party, pawan movies, pawan kalyan politics, political parties.

janasena party Chief pawan kalyan full buzz

బిజీ అవుతున్న పవన్ కళ్యాణ్

Posted: 03/29/2014 11:10 AM IST
Janasena party chief pawan kalyan full buzz

జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  మళ్లీ బిజీ అవుతున్నాడు. నిన్నటి వరకు  రాజకీయల్లోకి వస్తాడు అనుకున్నా రాజకీయ పార్టీలు,రాజకీయ నాయకులు  కొంచెం ఊపిరి పీల్చుకున్నారు.  పవన్ కళ్యాణ్  రాజకీయల్లోకి రావటం లేదని,  ఓట్లు చీల్చటం ఇష్టం లేదని చెప్పంతో   కొన్ని రాజకీయ పార్టీలు  పండగ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇక నుండి తనను నమ్ముకున్న నిర్మాతలకు, అభిమానులకు న్యాయం చేయటానికే మళ్లీ పవన్ బిజీ అవుతున్నాడు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత గబ్బర్ సింగ్ 2 తో పాటు వెంకీతో కలిసి ఓ మై గాడ్ సినిమా రీమేక్లో కూడా నటించడానికి రెడీ అయ్యాడు. అయితే అంతలోనే పవన్ రాజకీయ పార్టీని అనౌన్స్ చేసి సభలలో బిజీ అయిపోవడంతో ఇక సినిమాలు గల్లంతే అనుకున్నారు.

దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే మామూలుగానే పవన్ కుదిరితే రెండేళ్ళకు ఓ సినిమా చేస్తాడు లేదంటే ఇంకా ఎక్కువ సమయమే పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటిది ఇక ఒకపక్క రాజకీయలతో మరోపక్క సినిమాలు అంటే కష్టం అనుకున్నారు. అయితే పవన్ వైజాగ్  సభతో మరో ఐదేళ్ళ పాటు పవన్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమేనని అర్ధమైపోయింది.

దీంతో ఇక ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీ అయిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ దశలో ఆగిపోయిన గబ్బర్ సింగ్ 2 తో పాటు అంతా సిద్దంగా ఉంది సెట్స్ మీదకు వెళ్ళడమే ఆలస్యం అనుకుంటున్న వెంకీ సినిమాను కూడా లైన్లోనే పెట్టే అవకాశాలు కనబడుతున్నాయని చెబుతున్నారు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh