Censor problem for balayya legend

balakrishna, balayya, legend movie, censor officer Dhanalashmi, Censor Problem for balayya Legend, Censor Board Dhanalakshmi, Legend Movie News, Nandamuri Balakrishna, Varma, Manchu mohan babu.

Censor Problem for balayya Legend

బాలయ్యకు ధనలక్ష్మీ కష్టాలు?

Posted: 03/26/2014 06:41 PM IST
Censor problem for balayya legend

మొన్న వర్మ, నిన్న మంచు మోహన్ బాబు,  నేడు  నందమూరి బాలయ్య ఇంకా చాలా మంది   ఈ కత్తెర ధనలక్ష్మీ  చేతిలో  కష్టాలు అనుభవించిన వారే.  కోట్లు ఖర్చు పెట్టి  సినిమా షూటింగు పూర్తి చేస్తే,  ఈ కత్తెర ధనలక్ష్మీ దగ్గరకు వచ్చే సరికి అందరికి  చెమట్లు పడుతున్నాయి.  

కత్తెర ధనలక్ష్మీ అంటే   సెన్సార్ అధికారి. బాలకృష్ణ నటించిన 'లెజండ్' సినిమాకి సెన్సార్ గండం ఎదురైంది. ఈ సినిమా నిన్న సెన్సార్ కు వెళ్ళింది. అయితే, సినిమాలో రాజకీయపరమైన, అభ్యంతరకరమైన డైలాగులు ఉన్నాయని చెప్పి, సెన్సార్ అధికారి ధనలక్ష్మి సర్టిఫికేట్ ఇవ్వకుండా పెండింగులో పెట్టినట్టు చెబుతున్నారు.

అభ్యంతరకరమైన ఆ డైలాగులను తొలగించడమో ... లేక, ఎలక్షన్ కమిషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవడమో చేయమని సెన్సార్ అధికారి ధనలక్ష్మ్  నిర్మాతలకు సూచించినట్టు సమాచారం. దీంతో ఈ నెల 28న రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న నిర్మాతలు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. 

ఈ విషయం కాస్త  బాలయ్యకు  తెలిసిందట. దీంతో  బాలయ్య  ధనలక్ష్మీ కత్తెర నుండి ఎలా తప్పించుకుంటాడో  చూడాలి.  లెజెండ్ సినిమా విడుదల ముహూర్తం  పెట్టిన బాలయ్య, ధనలక్ష్మీ గండం ఎలా  చేదిస్తాడో చూద్దాం. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles