Action hero gopichand with shruti hassan

hero gopichand, shruti hassan, action hero gopichand with shruti hassan, gopichan movie shruti hassan.

action hero gopichand with shruti hassan

శృతి హాసన్ తో ఒక్క ఛాన్స్ అంటున్న గోపిచంద్?

Posted: 03/26/2014 06:27 PM IST
Action hero gopichand with shruti hassan

ప్లాపుల పరాజయంతో ఉన్న నటుడు గోపిచంద్  కన్ను.. అద్రుష్ట దేవత   భాగ్యలక్ష్మీ(శృతి హాసన్) పై పడింది. శృతి హాసన్ తో ఒకే ఒక్క ఛాన్స్  అంటూ ఆశగా  గోపిచంద్ ఎదురుచూస్తున్నారు.  అసలే గబ్బర్ సింగ్  పిల్లా,  పవన్ పవర్ తో  టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ లలో దూసుకుపోతుంది.  

అలాంటి భాగ్య లక్ష్మీతో సినిమాతో చేస్తే  అద్రుష్టం కలిసి వస్తుందని,  బలుపు హీరో రవితేజ , నటుడు గోపిచంద్ కు ఉచిత సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే తొలిసారిగా శృతి హాసన్ పక్కన నటించే అవకాశం  యాక్షన్ హీరో గోపిచంద్ కు దక్కింది.ఇటీవల 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రాన్ని డైరెక్ట్ చేసిన శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. 

భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మించే ఈ సినిమాలో కథానాయికగా శృతి హాసన్ ని తీసుకోవాలని దర్శకుడు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఆమెతో చర్చలు కూడా జరుగుతున్నట్టు చెబుతున్నారు.  యాక్షన్ హీరో గోపిచంద్  భాగ్య లక్ష్మీ ఒక్క ఛాన్స్ ఇస్తుందో లేదో చూడాలి. 

ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles