Balakrishna legend bike auction for a cause

Balakrishna, balayya, A Harley Davidson bike, Legend, Legend movie, Legend bike auction, Legend Bike For Sale, Nandamuri Balakrishna, Boyapati Srinu, Devi Sri Prasad,

Balakrishna Legend bike auction for a cause

లెజెండ్ బైకును అమ్ముతున్న బాలయ్య?

Posted: 03/26/2014 04:13 PM IST
Balakrishna legend bike auction for a cause

నటసింహం నందమూరి  బాలకృష్ణ బైకు అమ్ముతున్నారు.  బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా విడుదలకు సిద్దంగా  ఉన్న విషయం తెలిసిందే. అయితే   బాలకృష్ణ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. బోయపాటి దర్శకత్వంలో   రెండో సినిమాలో  బాలకృష్ణ వాడిన  బైక్ ను అమ్మటానికి  సిద్దమయ్యడు.  

ఇటీవల  లెజెండ్  మూవీ  మొదటి షో టిక్కెట్ ధర పలికిన డిమాండ్  ద్రుష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లెజెండ్ మూవీలో  బాలకృష్ణ ఉపయోగించిన హార్లే డేవిడ్సన్ బైక్ ను వేలానికి పెట్టనున్నారు, వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి విరాళంగా ఇవ్వనున్నారు.

లెజెండ్  నిర్మాతలు బైక్ వేలంలో వచ్చిన సొమ్ము పేదవారికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని ,ఈ వేలాన్ని లెజెండ్ చిత్రం విడుదల కాకముందే నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో బాలకృష్ణ కోసం ఆరెంజ్ కలర్ హార్లే డేవిడ్సన్ బైక్ ను  ప్రత్యేకంగా డిజైన్ చేయించిన సంగతి తెలిసిందే!

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles