Allu arjun comments on chiru and pawan

allu arjun, Chiranjeevi, pawan kalyan, allu arjun comments on chiru and pawan, allu arjun comments on pawan kalyan, allu arjun sensational comments on pawan.

allu arjun comments on chiru and pawan

చిరు-పవన్ లపై అర్జున్ కామెంట్....

Posted: 03/24/2014 10:36 AM IST
Allu arjun comments on chiru and pawan

ఇప్పుడు మెగా ఫ్యామిలీ సభ్యులు  మీడియా ముందుకు రావాలంటే పెద్ద టాస్క్ గా ఫీలౌతున్నారు. మీడియా అడుగుతున్న పొలిటికల్ ప్రశ్నలకు బ్యాలన్స్డ్  గా సమాధానం చెప్పడం వారికి ఓ టాస్క్ గా మారింది. తాజాగా మెగా హీరో అల్లు అర్జున్ మీడియాకు ఎదురయ్యారు. 

రాజమండ్రి లో 'రేసుగుర్రం' సినిమా యూనిట్ తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న బన్నికి పొలిటికల్ ప్రశ్న ఎదురైయింది. చిరు, పవన్ లలో మీ మద్దత్తు ఎవరికనే ప్రశ్న వచ్చింది. సహజంగా వేదికలపై తన మాటల్లో కాస్త బ్యాలన్స్ తప్పే  బన్నీ ఈ ప్రశ్నపై ఎలా స్పందిస్తాడో? అని అందరు ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే బన్నీ ఓ డిప్లమేటిక్‌ సమాధానం చెప్పాడు. 

'పవన్ అంటే ఇష్టం, చిరంజీవి అంటే ప్రాణం' అని చెప్పుకొచ్చాడు. అయితే పాలిటిక్స్ గురించి నాకు తెలియదు. పాలిటిక్స్ పై స్పదించనంటు ఆ ప్రశ్న నుండి సున్నితంగా తప్పించుకున్నాడు. ఇక సినిమాల్లో తనకి ఎవరూ పోటీ లేరని కూడా చెప్పాడు.

 "ఒకరి రికార్డులు బ్రేక్ చేయాలన్నది నా కోరిక కాదు. నా రికార్డులను నేనే అధిగమించాలనుకుంటున్నాను.

అందుకే, నాకెవరూ ఇక్కడ పోటీ కాదు. నాకు నేనే పోటీ" అని చెప్పాడు అల్లు అర్జున్.  ఏమైన బన్నీ భలే తెలివిగా  'పవన్ అంటే ఇష్టం, చిరంజీవి అంటే ప్రాణం' అనే డిప్లమేటిక్‌ మాటతో ఇటు చిరు ఫాన్స్, అటు పవన్ ఫ్యాన్స్  దిల్ కుష్ చేశాడనే చెప్పాలి.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles