Mahesh babu support to pawan jana sena party

Mahesh Babu, pawan kalyan, pawan, janaseana party, Mahesh Babu Support pawan party, congress party, janasean, pawan fans, mahesh fans, 2014 election.

Mahesh Babu Support to Pawan Jana Sena Party

పవన్ నినాదమే.......మహేష్‌ నినాదమా..!

Posted: 03/22/2014 07:06 PM IST
Mahesh babu support to pawan jana sena party

అవుననే అంటున్నారు టాలీవుడ్ పెద్దలు. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, ప్రిన్స్‌ మహేష్‌బాబు ఇద్దరిదీ ఒకే నినాదమే. వీరిరువురు దానికోసమే ఒక్కటవుతున్నారా అంటే అవుననే సమాధానాలు ఇండస్ట్రీతో పాటు రాజకీయవర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే మహేష్‌ సహచర నటుడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ జనసేన పేరుతో పార్టీ పెట్టి ‘కాంగ్రెస్‌కు హటావో, దేశ్‌కి బచావో’ నినాదంతో ప్రజల ముందుకు దూసుకెళుతున్న విషయం విదితమే.

ఇక ప్రిన్స్‌ మహేష్‌బాబు కూడా దాదాపు పవన్‌ నినాదంతోనే ప్రజల్లోకి వెళుతున్నట్టు సమాచారం. మహేష్‌ జయదేవ్‌కు మద్దతుగా గుంటూరులో ‘కాంగ్రెస్‌కు హటావో, దేశ్‌కి బచావో’ అనే నినాదంతోనే ప్రచారం చేయనున్నట్టు సమాచారం.

ఇందుకు కారణం ఏమిటంటే గత ప్రభుత్వ హయాంలో పద్మాలయా భూముల విషయంపై వివాదాన్ని రేపి కావాలని తనను ఇందులో ఇరికించే ప్రయత్నాలు జరిగాయని మహేష్‌ భావిస్తున్నట్టు సమాచారం.అయితే అప్పటి ప్రభుత్వ నేతలు కావాలనే పట్టించుకోలేదని వారిపై మహేష్‌ గుర్రుగా ఉన్నారు. 

దీంతో ఆయన కూడా కాంగ్రెస్‌ను భూస్థాపింతం చేయాలని పైకి నినాదాలు ఇవ్వపోయినా లోలోపల అదే నినాదాన్ని నిజం చేయాలన్న పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.  మహేష్ బాబు కూడా పవన్ తోకలిసి వస్తే.  కాంగ్రెస్ హఠవ్, దేశ్ బచావ్ అనేది జరుగుతుందని  రాజకీయ పండితులు అంటున్నారు. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh