Pawan fans upset ec rejected pawan jana sena party

pawan kalyan, pawan kalyan party, rejected Pawan Jana Sena party, EC rejected Pawan Jana Sena party, Jana Sena party, Pawan Fans upset.

Pawan Fans upset: EC rejected Pawan Jana Sena party

పవన్ "జన సేన" పార్టీకి ఈసీ మొదటి దెబ్బ?

Posted: 03/13/2014 09:52 AM IST
Pawan fans upset ec rejected pawan jana sena party

పవన్ కళ్యాణ్  ‘‘జనసేన’’ పార్టీ ఎన్నికల  కమిషన్ వద్ద రిజిస్టర్ కాలేదనే వార్త హల్ చేల్ చేస్తుంది. ఈ ఎంత వరకు నిజమో తెలియాదు గానీ,  పవన్ పార్టీ  రిజిస్టర్ కాలేదని తెలియటంతో.. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు  ఊపీరి పీల్చుకున్నారు.

పవన్ కళ్యాణ్ "జన సేన" పేరుతో పార్టీని ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసినట్టు వచ్చిన వార్తల పై ఎన్నికల సంఘాన్ని వివరణ కోరగా, ఇంత వరకూ "జన సేన పార్టీ" పేరుతో ఎవరికీ రిజిస్ట్రేషన్ కాలేదు. 

ఒక పార్టీ దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ కావడానికి 3 నుండి 4 నెలల వ్యవధి  పడుతుంది అని ఎన్నికల సంఘం తెలిపింది. దీనిని బట్టి బహుశా పవన్ కళ్యాణ్ "జన సేన" పేరుతో ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు మాత్రమే చేశాడని అనుకోవచ్చు. కాబట్టి "జన సేన" అనే పార్టీ ఎన్నికల సంఘం గుర్తింపు పొందడానికి ఇంకా 4 నెలల సమయం పట్టొచ్చు.

దీంతో  పవన్  పార్టీ నేతలు  అయోమయంలో పడ్డారు. జన సేన పార్టీతో  2014 ఎన్నికల్లో పోటీ చేయరాదు గానీ,  ఇండిపెండెంట్ గా  పోటీ చేయవచ్చు.  అయితే  పవన్  పార్టీ నేతలు .. ఆ దిశగా  అడుగులు వేస్తున్నట్లు   సమాచారం. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles