Mani multistar movie nagarjuna and mahesh babu

Nagarjuna, Mahesh Babu, Mani Ratnam, Mani Ratnam Multistar Movie, telugu movie.

Mani Multistar Movie Nagarjuna and Mahesh Babu, Mani next starring Nagarjuna, Mahesh Babu

మణితో నాగార్జున-మహేష్ బాబు

Posted: 03/13/2014 10:21 AM IST
Mani multistar movie nagarjuna and mahesh babu

ఇరవై అయిదు సంవత్సరాల తరువాత  మళ్లీ  మన తెలుగులోకి  మణి అడుగుపెడుతున్నారు. ఈసారి ఏకాంగా  అక్కినేని  నాగార్జున, మహేష్ బాబు తో సినిమా చేస్తారనే  ప్రచారం జరుగుతోంది.ఈ ద్విభాషా చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనుండడంతో ఫిలిం నగర్ సర్కిల్స్ లో హాట్ టాక్ గా మారింది. అయితే ఈ చిత్ర ప్రాజెక్ట్ ఉంటుందా కేవలం రూమర్స్ మాత్రమేనా అనే సందేహాలు కూడా తలెత్తాయి. 

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం తొందర్లోనే సెట్స్ మీదకు వెళ్లనుందట. జూన్ చివరి వారంలో గానీ జులై మొదటి వారంలో గానీ ఈ చిత్రం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో అసిన్ హీరోయిన్ గా నటిస్తోంది. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ఇప్పటికే మణిరత్నం నాగార్జున, మహేష్ తో కథా చర్చలు కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో మణి బిజీగా ఉన్నాడు.

ఇటీవలే ఈయన దర్శకత్వంలో వచ్చిన కడలి బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయం చవి చూసింది. అందుకే నాగ్, మహేష్ లతో తెరకెక్కించే మల్టీస్టారర్ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా రూపొందించేందుకు కష్టపడుతున్నాడట. మహేష్ బాబు నటిస్తున్న ఆగడు జూన్ లో పూర్తవుతుంది. ఆ తర్వాత మణిరత్నం సినిమాలో జాయిన్ అవుతాడు.

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles