Ramcharan loves calf

Ramcharan, Ramcharan Upasana, ram charan love with calf, ram charan and krishna vamsi, movie shooting in kanyakumari.

Ramcharan loves calf

ఆవు దూడ పై ప్రేమ కురిపించిన రామ్ చరణ్

Posted: 03/05/2014 07:03 PM IST
Ramcharan loves calf

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  మాటల్లో కాదు.. చేతుల్లో చేసి చూపించాడు. రామ్ చరణ్ భార్య ఉపాసన వలన ఆ ప్రేమ వచ్చిందో లేక చిన్నప్పటి నుండి రామ్ చరణ్ కు ఉందో తెలియదు గానీ.. మొత్తం మీద  రామ్ చరణ్, ఉపాసనలు  జంతు ప్రేమికులని తేలిపోయింది. 

ప్రస్తుతం రామ్ చరణ్  కృష్ణవంశీ దర్శకత్వంలో షూటింగు  కన్యాకుమారిలో జరుగుతుంది. ఈరోజు ఆయన షూటింగులో బాగా  ఆలసి పోయి రేస్టు తీసుకుంటున్నారు.  అయితే ఈరోజు ఒక అద్బుతమైన సన్నివేశం జరిగింది.

అక్కడ ఇటీవల ఈ రోజు షూటింగు చేసి చేసి అలసిపోయి, రేస్టు తీసుకుంటున్న మన రామ్ చరణ్  కంట ఒక ఆవు దూడ  పడింది.  అది చాలా ముద్దుగా ఉంది.  పచ్చిన గట్టిపై .. నల్లని ఆ లేగ దూడ చాలా అందంగా ఉంది.  రామ్ చరణ్ ఆ దూడను చూడగానే  పరిగెత్తుకెళ్లి ఆ దూడును ఎత్తుకుని అక్కున చేర్చుకున్నాడు.  

అలా రామ్ చరణ్  దూడను ఎత్తుకునే ప్రయత్నంలో.. షూటింగ్ లో ఉన్న కెమెరా కన్ను కొట్టింది. ఆ ప్రయత్నమే ఇది. అయితే  దూడ బరువుగా వున్నా రామ్ చరణ్ చాలా సేపు ఎత్తుకోవటానికి ట్రై చేశాడు.

ఈ సమయంలో తనలోని అలసట మరిచిపోయి, ఆనందంతో పొంగిపోయాడు.  షూటింగుతో అలసిన నాకు ఇదొక చిన్న ఆనందాన్నిచ్చిందని చరణ్ అంటున్నాడు.  చరణ్ కి మూగజీవాలంటే ఎంతో ఇష్టమన్న దానికి ఇది మరో నిదర్శనం. ఈ అందమైన ఫోటోని అభిమానుల కోసం ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు!

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles