Mahesh injured on aagadu movie shooting sets

Mahesh Babu, Aagadu movie, Mahesh injured on Aagadu movie shooting sets, Mahesh Babu got injured in Bellary, Mahesh Babu fans, Mahesh Babu injured on Aagadu sets.

Mahesh injured on Aagadu movie shooting sets, Mahesh Babu got injured in Bellary

బళ్లారిలో మహేష్ బాబు గాయాలు - ఫ్యాన్స్ పూజలు?

Posted: 03/05/2014 06:15 PM IST
Mahesh injured on aagadu movie shooting sets

ప్రిన్స్ మహేష్ బాబు  శ్రీను వైట్ల దర్శకత్వంలో  ‘ఆగడు’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ‘ఆగడు’ సినిమా టీమ్ బళ్లారికి వెళ్లిన విషయం తెలిసిందే.  ఈరోజు  మహేష్ బాబు షూటింగ్ జరుగుతున్న సమయంలో  చిన్న ప్రమాదం జరిగినట్లు సమాచారం. అ ఈ ప్రమాదంలో మహేష్ బాబు గాయపడ్డట్టు ఫిలిం నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.

గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని బళ్ళారి పట్టణంలో జరుగుతోంది. అక్కడి గనులలో షూటింగు జరుగుతుండగా ప్రమాదం జరిగి మహేష్ కాలికి గాయమైనట్టు చెబుతున్నారు. దీంతో ఆయనను వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవలసిందిగా డాక్టర్లు సూచించడంతో, షూటింగు ఆపేసి, ఆయన హైదరాబాదుకు చేరుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈవిషయం తెలుసుకున్న  మహేష్ బాబు ఫ్యాన్ ఆందోళన చెందారు. తరువాత  అసలు విషయం తెలుసుకొని  మహేష్ బాబు అభిమానులు  ఊపిరి పీల్చుకున్నారు.  భారీ ఫైట్ తీస్తున్న సందర్బంలో  ఈ గాయం అయినట్లు చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.  ఏమైన మహేష్ బాబు  పెను ప్రమాదం నుండి బయటపడ్డారని,  అభిమానులు  దేవుడికి పూజలు చేస్తున్నాట్లు  ఫిలింనగర్  టాక్. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles