Pawan kalyan political party breaks with election commission shock

pawan kalyan, power star pawan kalyan, pawan kalyan political party, pawan kalyan press meet, pawan politicalparty breaks with election commission shock, election code, Elections 2014, pawan kalyan fans upset.

pawan kalyan political party breaks with election commission shock

పవన్ పార్టీకి బ్రేక్ వేసిన ఎలక్షన్ కమిషన్ ?

Posted: 03/06/2014 09:41 AM IST
Pawan kalyan political party breaks with election commission shock

గత వారం రోజుల నుండి మీడియాలో, రాజకీయ నాయకుల్లో  ఒకటే హడావుడి.  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  పొలిటికల్ పార్టీ పెడుతున్నాడని ఒకటే సందడి. ఈ వార్తలో ఎంత నిజం ఉందో మాత్రం ఎవరికి తెలియదు.

పవర్ కళ్యాణ్  పొలిటికల్ పార్టీ పై  మార్చి రెండో వారంలో మీడియా ప్రకటన చేస్తానని  చెప్పినట్లు  ఆయన కార్యలయం నుండి ఒక లేఖ విడుదల చేశారు. దాని ఆధారంగా.. అనేక కట్టుకథలు  వెబ్ పోర్టల్స్ , మీడియా, రాజకీయ నాయకుల్లో హల్ చల్ చేస్తున్నాయి.   

పవన్ కళ్యాణ్  ప్రెస్ మీట్ పెట్టకముందే.. ఆయన రాజకీయ పార్టీకి  ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. రేపో మాపో కొత్త పార్టీని పెట్టి తన క్రేజ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తన పార్టీ జెండా ఎగరవేసి, తను చక్రం తిప్పుతారు అని అనుకున్న ఫ్యాన్స్ ఆశలు అడియాశలు అయిపోయేలా కనిపిస్తున్నాయి.

ఎందుకంటే... దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్ధానాలకు, ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ షెడ్యూల్ ఖరారుచేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది  దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. దీనితో పవన్ కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉండదు. 

అలా కాకుండా గతంలో మెగా అన్నయ్య చిరంజీవి పెట్టి మూసేసిన ప్రజారాజ్యం పార్టీని తిరిగి మళ్ళీ ఓపెన్ చెయ్యాలన్నా కొన్ని అడ్డంకులు ఉన్నట్లు తెలుస్తుంది. దీనినిబట్టి చూస్తుంటే పవన్ రాజకీయాల్లోకి రావాలంటే ఇప్పుటికే ఉన్న పార్టీలలొకే వెళ్ళాలి.

ఇప్పుటికే తెలుగు దేశం, లోకసత్తా, ఆమ్ ఆద్మీ పార్టీలు పవన్ కు ఆహ్వానం పంపగా, పవన్ ఏమి చేస్తారనేది ఆసక్తి గా మారింది.  మార్చి రెండో వారం  పవన్ కళ్యాణ్  ఏం చెబుతాడు, ఏం జరుగుతుందో చూద్దాం. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles