Jr ntr and nagarjuna multi starrer movie

Jr NTR, Akkineni Nagarjuna, PVP Cinema, Vamsi Paidipalli, Jr NTR Nagarjuna multi-starrer, Yevadu, Gundamma Katha remake, Naga Chaitanya, Tollywood, NTR and Nagarjuna to team up,

Jr NTR and Nagarjuna Multi Starrer Movie, NTR and Nagarjuna to team up?

జూనియర్ ఎన్టీఆర్ తో నాగార్జున క్లారిటీ?

Posted: 03/05/2014 05:14 PM IST
Jr ntr and nagarjuna multi starrer movie

టాలీవుడ్ మన్మథుడు మనసు మారుతుంది . త్వరలో మల్టీ స్టారర్ సినిమాలో హీరో నాగార్జున  నటించే అవకాశం ఉందని టాలీవుడ్ వాసులు అంటున్నారు.  ఏ హీరోకైన సోలోగా సినిమాలు చేసి మెప్పించ‌డానికి ఒక లిమిటేష‌న్ వుంటుంది. ఆ మార్క్ దాటిన త‌రువాత అభిమానులే హీరోగా రిసీవ్ చేసుకోవ‌డానికి ఇబ్బంది ప‌డుతుంటారు. ఆ ఇబ్బందిని హీరో నాగార్జున గ‌మ‌నించిన‌ట్లే ఉన్నాడు. 

ఇప్పటికే  సీనియ‌ర్ హీరోలు వెంక‌టేష్, నాగార్జున‌, బాల‌య్య లు సోలోగానే చేస్తాం అంటే కొంత క‌ష్టమైన ప‌నే. ఎందుకంటే.. వీళ్లంత 50 ప్లస్ ఏజ్ వున్న సీనియ‌ర్స్. అన్ని రోల్స్ కు సూట్ కారు. ఆ విష‌యం హీరో వెంక‌టేష్ అంద‌రికంటే ముందే గ్రహించాడు. అందుకే గ‌త యేడాది సంక్రాంతికి సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు అంటూ మ‌హేష్ బాబు తో క‌ల‌సి ఒక మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం చేశాడు.

తాజాగా ఇదే బాట‌లో మ‌రో సీనియ‌ర్ హీరో నాగార్జున కూడా మ‌ల్టీ స్టార‌ర్ కు సిద్దమ‌య్యాడు. అల్రేడి మ‌ణి ర‌త్నం డైరెక్షన్ లో హీరో మ‌హేష్ బాబు తో క‌ల‌సి న‌టించ‌నున్నాడ‌నే టాక్ ఈ మ‌ధ్య వినిపించిన విషయం తెలిసిందే. దీంతో పాటు అల్రేడి వాళ్ల ఫ్యామిలీ మూవీ మ‌నం ఆడియ‌న్స్ ముందుకు రావ‌డానికి సిద్ధంగా వున్న విష‌యం తెలిసిందే.

ఇక తాజా స‌మాచారం ఏమిటంటే.. డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ఎన్టీఆర్ తో చేయ‌బోయ చిత్రంలో నాగార్జున కూడా ఒక కీ రోల్ చేయ‌నున్నడాని టాక్ వినిపిస్తుంది. 2014 లో ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లనుంద‌ని స‌మాచారం వినిపిస్తుంది మ‌రి.!

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles