Rajinikanth s wife latha sings for kochadaiyaan

Rajinikanth, Superstar Rajinikanth, Latha Rajinikanth, Manapennin Sathiyam, Rajinikanth-s wife latha sings for Kochadaiyaan, Kochadaiiyaan Rajinikanth, Kochadaiiyaan movie, Kochadaiiyaan audio release, Kochadaiiyaan audio release marchi 9.

Rajinikanth-s wife latha sings for Kochadaiyaan

చివరకు రజనీకాంత్ భార్య చేత కూడా..?

Posted: 03/05/2014 03:59 PM IST
Rajinikanth s wife latha sings for kochadaiyaan

తమిళ సూపర్ స్టార్  రజనీకాంత్ అంటే ఇష్టపడని అభిమాని ఎవరు ఉండరు. ఇక రజనీకాంత్ నటించిన 'కొచ్చాడియాన్'  సినిమా  ప్రేక్షకుల  ముందుకు వస్తుందంటే.. రజనీ అభిమానులకు పెద్ద పండుగే.  'కొచ్చాడియాన్'  సినిమా ఈనెల 9వ తేదీన  ఆడియో విడుదల చేస్తున్నారు. అయితే  ఈ ఆడియో ఫంక్షన్లో చాలా ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి. 

రజనీకాంత్ సినిమా అంటేనే రిచ్ నెస్ ఉట్టిపడుతుంది. అందుకు తగ్గట్టుగానే ఆయన సినిమాలకు సంబంధించిన వేడుకలు కూడా గ్రాండ్ గానే జరుగుతాయి. ఇప్పుడు ఆయన నటించిన 'కొచ్చాడియాన్' (తెలుగులో విక్రమసింహా) సినిమా ఆడియో వేడుక కూడా అలాగే రిచ్ గా జరుగుతోంది. 

ఈ నెల 9న చెన్నయ్ లోని సత్యం ధియేటర్లో జరిగే ఈ వేడుకకు అమితాబ్ చీఫ్ గెస్ట్ గా వస్తుండగా ... 800 మంది అతిథులను ఆహ్వానించారు.  మరో విశేషం ఏమిటంటే, ఈ ఆడియో ఇన్విటేషన్ ను 3డిలో రూపొందించారు. ఈ సినిమాలోని రజనీ గెటప్పును 3డి ఇమేజ్ లో ముద్రించారు. ఇంకో విశేషం ఏమిటంటే, ఈ ఇన్విటేషన్ ను చైనాలో ముద్రించారు. ఈ ఇన్విటేషన్ల డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలైంది!

ఇప్పుడు రజనీకాంత్ నటించిన 'కొచ్చాడియాన్'  సినిమాలో మరో ప్రత్యేకత ఉందని అంటున్నారు.  ఇప్పటి వరకు   రజనీకాంత్  భార్యగా లతా గా అందరికి తెలుసు. కానీ ఆమె ఏరోజు రజనీకాంత్ భార్య హోదాలోనే ఉంది. కానీ ఇక నుండి ఆమెకో హోదా వచ్చింది. తన భర్త నటించిన, కూతురు దర్శకత్వంలో వస్తున్న  'కొచ్చాడియాన్'  సినిమాలో   రజనీకాంత్ భార్య ఒక పాట పాడినట్లు తెలుస్తోంది. 

ఈ విషయాన్ని ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచారు. ఈ నెల 9న ఆడియో వేడుక జరుగుతున్న సందర్భంగా తాజాగా ఆడియో ట్రాక్ లిస్టును రిలీజ్ చేశారు. దీంతో ఈ విషయం బయటపడింది. 'మనపెన్నిన్ సత్తియం ...' అంటూ ఈ పాట సాగుతుంది.

లత మంచి గాయని అన్న సంగతి చాలా మందికి తెలిసిందే. ఇప్పుడీ పాట అభిమానులను మరింతగా అలరిస్తుందనే చెప్పచ్చు! ఒక తెరపై రజనీకాంత్ కుటుంబం  అంత ఉమ్మడిగా కనిపిస్తుందని  రజనీ అభిమానులు అంటున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles