Jr ntr next film with puri jagannath

jr ntr next film with puri, jr ntr puri jagannath, jr ntr puri jagannath film, jr ntr puri jagannath new film, jr ntr upcoming films, jr ntr next films

Jr NTR-Puri combo movie to be produced by Puri under his own banner is likely to go on floors later this year. This would be second combination film after Andrawala.

‘ఆంధ్రావాలా ’ కాంబినేషన్ ఈసారి అదిరేనా?

Posted: 02/25/2014 05:29 PM IST
Jr ntr next film with puri jagannath

ఒకప్పుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకునేవారు స్టార్ హీరోలు. కానీ గత కొంత కాలం నుండి పూరీ తనకు ఇష్టం వచ్చిన స్టోరీలతో సినిమాలు తీసేస్తూ జనాల్ని విసిగించడమే కాకుండా సదరు హీరోల ఖాతాలో ఓ ప్లాప్ సినిమాను పడేయడంతో వారు ఇతనితో నటించడానికి ఆసక్తి చూపించడం లేదు.

ఇటీవల నితిన్ తో తీసిన ‘హార్ట్ ఎటాక్ ’ సినిమా కాస్తంత ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు పూరీ తన తరువాతి ప్రాజెక్టు కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. మాములుగా పూరి జగన్నాధ్ మహేష్ బాబు తో సినిమా చెయ్యాలి కానీ ఆ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా చాలా సమయం ఉండడంతో పూరి జగన్నాధ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఉవ్విళ్లూరుతున్నాడు.

గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఆంధ్రావాలా ’ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో, ఎలాగైనా ఇతనికి మంచి బ్రేక్ ఇవ్వాలనే పట్టుదలతో పూరీ ఇప్పటికే తారక్ కి స్టోరీ లైన్ చెప్పడం, అది తారక్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఎన్.టి.ఆర్ ‘రభస’ షూటింగ్ పూర్తి చేసాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles