Rakul preet singh rejected naresh movie

Rakul Preet Singh Rejected Naresh Movie, Rakul Preet Singh Tweets, Rakul Rejected Naresh Offer

Rakul had reportedly informed that she is not pairing up with Naresh and that her next film will be with Manchu Manoj.

అల్లరోడి ప్రక్కన ఛాన్స్ ని వదులుకుంది

Posted: 02/25/2014 03:55 PM IST
Rakul preet singh rejected naresh movie

టాలీవుడ్ లో ఇటీవల వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో సందీప్ కిషన్ తో ఆడి పాడిన రాకుల్ ప్రీత్ సింగ్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవమే కాకుండా, అటు దర్శక నిర్మాతల మనసు దోచిన ఈ అమ్మడుకు తెలుగు లో అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయని, ప్రస్తుతం మంచు మనోజ్ తో ఓ సినిమాకు సైన్ చేసిన ఈ అమ్మడికి అల్లరి నరేష్, వీరభద్రం కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాలో అవకాశం దక్కిందనే వార్తలు వినిపించాయి.

ఈ వార్తల పై ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ... తాను అల్లరి నరేష్ సినిమాలో చేయడం లేదని, ప్రస్తుతం తన చేసితో నాగేశ్వర్ రెడ్డి-మనోజ్ కాంబినేషన్ సినిమా మాత్రమే ఉందని, తన పై వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని తేల్చిపారేసింది. ఇక ఈమె త్వరలో ‘రఫ్ ’ సినిమాతో  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో స్వర్గీయ శ్రీహరి ఒక ముఖ్యపాత్రపోషించాడు. ఈ అమ్మడు ఇలా వచ్చిన అవకాశాల్ని ఇలా కాదంటే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండటం కష్టమే అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles