Jr ntr problems faced in rabasa movie

junior ntr, ntr, rabasa movie, Jr NTR problems faced in rabasa movie, rabasa movie director, santhosh srinivash, rabasa.

Jr NTR problems faced in rabasa movie

ఎన్టీఆర్ రభస పరిస్థితి ఏమిటి?

Posted: 02/19/2014 10:15 AM IST
Jr ntr problems faced in rabasa movie

 జూనియర్ ఎన్టీఆర్ కు  బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. అందు కోసం  తెగ కష్టపడుతున్నాడు.  అయితే ఎన్టీఆర్  ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.  ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని  ఎన్నో కలలు  కంటూ  ఉంటే   అనుకోని  పరిస్థితులు  ఎన్టీఆర్ కు  షాక్ ఇస్తున్నాయి. ఎన్టీఆర్ నటింస్తున్న రభస సినిమా కష్టాల్లో పడినట్లు సమాచారం.  ఎన్టీఆర్ రభస  సినిమాకు కష్టాలు రావటానికి కారణం.. ఆ సినిమా  దర్శకుడే అని  అంటున్నారు.  రభస సినిమాకు  సంతోష్ శ్రీనివాస్  దర్వకత్వం వహిస్తున్నారు. 

ఇప్పుడు టాలీవుడ్  లో  ఎన్టీఆర్ రభస గురించి చర్చించుకుంటున్నారు.   దర్శకుడు  సంతోష్ శ్రీనివాస్  కారణంగా  రభస సినిమా కష్టాల్లో  పడటంతో..ఎన్టీఆర్ అభిమానులు అందోళన చెందుతున్నారు.  ఏ సినిమా అయిన  నిర్మాత వల్లో, లేక హీరోయిన్  వల్లో , కొన్ని సినిమాలు మద్యలోనే ఆగిపోయిన సందర్భలు చాలా ఉన్నాయి. కానీ ఇలా దర్శకుడు వల్ల ఆగిపోయిన సినిమాలు చాలా తక్కువని .. సినీ పెద్దలు అంటున్నారు. 

ఎన్టీఆర్ రభస సినిమా  కష్టాల్లో  పడటానికి కారణం  దర్శకుడు  సంతోష్ శ్రీనివాస్   కొంతకాలంగా తీవ్ర  అనారోగ్యంతో  బాధపడుతున్నట్లు  సమాచారం. దర్శకుడికి జాండిస్ అని  టాలీవుడ్ టాక్ నడుస్తుంది. ఈ సినిమా షూటింగ్  అర్థాంతరంగా  ఆగిపోయిపోవటంతో , మరో దర్శకుడితో రభస సినిమా షూటింగ్  పూర్తి చేయటానికి   నిర్మాత సిద్దమైనట్లు  సమాచారం. 

అయితే  దర్శకుడ్ని మార్చే ఉద్దేశం   జూనియ్ ఎన్టీఆర్ కు లేదని అంటున్నారు.   ఎన్టీఆర్ మాత్రం ఎలాగైన రభస సినిమా పూర్తి చేయాలనే ఉద్దేశంతో.. సహాయ దర్శకులను పెట్టుకొని..  సినిమా పాటలు, యాక్షన్  సన్నివేశాలు  ఎన్టీఆర్ స్వయంగా చేస్తున్నట్లు  సమాచారం.  ఈ సినిమా  మే నెలాఖరుకు  విడుదల అయితే  చాలా గొప్ప విషయమే అని  చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. అప్పటి వరకు ఎన్టీఆర్ సినిమా లేనట్టే. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles