Venkatesh meena to screen romance again

Venkatesh, Meena, Venkatesh-Meena to screen romance again, Drishyam Telugu remake, Meena Venkatesh

Venkatesh-Meena to screen romance again

నటి మీనా తో వెంకటేష్‌ వన్స్‌మోర్!

Posted: 02/18/2014 10:46 AM IST
Venkatesh meena to screen romance again

నటి  మీనా  పెళ్లి తరువాత   సినిమాలు  తగ్గించుకని.. తల్లి పాత్రలకే పరిమితమైంది.  పదహరేళ్ల తరువాత మళ్లీ  తన సత్తా ఏమిటో చూపించటానికి వికర్టీ వెంకటేష్ తో.. జతకడుతుంది. చంటి సినిమాతో హిట్‌పెయిర్ అనిపించుకున్నారు వెంకటేష్, మీనా. చాలా కాలం తరువాత వీరిద్దరూ కలిసి ఓ చిత్రంలో నటించబోతున్నారని సమాచారం.   పదహారేళ్ల రొమాన్స్   వన్స్ మోర్ అంటూ.. వెంకీ చాలా ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

మోహన్‌లాల్, మీనా జంటగా నటించిన మలయాళ చిత్రం దశ్యం. ఈ సినిమా ఆధారంగా ప్రముఖ నటి శ్రీప్రియ ఓ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. మోహన్‌లాల్ పాత్రలో వెంకటేష్ నటించబోతున్నాడు. ఆయనకు జోడీగా మీనా నటించనుందని చిత్ర వర్గాల సమాచారం.

దశ్యంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించిన ఆమె ఇప్పుడు ఇదే పాత్రను తెలుగులో చేయనుందని, ఇందులో పోలీస్ అధికారి పాత్రలో అత్తారింటికి దారేది ఫేమ్ నదియాను ఎంపిక చేశారని తెలిసింది. వెంకటేష్‌తో కలిసి మీనా గతంలో అబ్బాయిగారు, సుందరకాండ, సూర్యవంశం వంటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles