300 jawans attack to comedian ali

telugu comedian ali, actor ali, Telugu actor Ali, telugu movies, Tollywood comedian Ali, 300 jawans.

300 jawans attack to comedian ali

అలీని చుట్టుముట్టిన 300 మంది జవాన్లు

Posted: 02/19/2014 11:26 AM IST
300 jawans attack to comedian ali

టాలీవుడ్   సీనియర్ కామెడీన్  అలీని  300 మంది జవాన్లు  చుట్టుముట్టారు. దీంతో  అలీ  పరిస్థితి దారుణంగా మారిపోయింది.  అంటే  వారు అలీని ఏదో  చేద్దామని మాత్రం కాదులేండి?  హిందీ చానెళ్ల పుణ్యమా అని తెలుగు సినిమాల డబ్బింగుల్ని ఉత్తరాది వారు కూడా చూస్తున్నారు. 

అలా అక్కడివారికి తెలిసిపోతున్నాం. లడక్‌ వెళ్లినా అభిమానులు గుర్తుపడుతున్నారు. వెంటపడుతున్నారు అన్నారు అలీ. లడక్‌లో సాహసం షూటింగులో ఉన్నప్పుడు దాదాపు 300మంది జవాన్లు చుట్టుముట్టి ఫోటోలు దిగారు.

ఆ సన్నివేశాన్ని జీవితంలో మర్చిపోలేను..అన్నారు. కమెడియన్‌గా హిందీలోనూ 30సినిమాల్లో నటించాను. తమిళ్‌, కన్నడ, మలయాళం చిత్రాల్లోనూ నటించాను. 

అలా అన్నిచోట్లా అభిమానం సంపాదించుకున్నా. హీరోగా యమలీలతో కెరీర్‌ ప్రారంభించి ఇప్పటికి 20ఏళ్లయ్యింది. అన్నపూర్ణ స్టూడియోలోనే ఈ సినిమా మొదలైంది. అదే చోట హీరోగా నా 50వ సినిమా చిత్రీకరణ పూర్తిచేశాను. 50వ సినిమా అలీబాబా ఒక్కడే దొంగ ఈ శుక్రవారం (21న) విడుదలవుతోంది.. అని తెలిపారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles