Mahesh babu next work to mani ratnam

mahesh babu,mani ratnam film,1 nenokkadine,aagadu, Maniratnam,mahesh babu next movie maniratnam,Mahesh babu 1 Nenokkadine movie

Telugu actor Mahesh Babu is set to work with notable director Mani Ratnam in his next project.

మణితో రిస్క్ చేస్తున్న మహేష్ బాబు

Posted: 01/14/2014 11:10 AM IST
Mahesh babu next work to mani ratnam

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సంవత్సరానికి ఒక్క సినిమా చేసినా కొత్తగా కనిపించి ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో ‘1’ సినిమాలో నటించాడు. ప్రస్తుతం శీను వైట్ల దర్శకత్వంలో ‘ఆగడు ’ సినిమా చేస్తున్నాడు. ‘వన్ ’ సినిమా లో కొత్తగా కనిపించిన మహేష్ మరో ప్రయోగానికి సిద్దం అవుతున్నాడు.

అదే మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ‘ఆగడు’సినిమా తరువాత ప్రిన్స్-మణిరత్నం కాంబినేషన్‌లో పట్టాలెక్కడానికి ఓ కథ సిద్ధంగా వుందట. ప్రస్తుతానికి మణి చేతిలో మూడు కథలు వున్నాయి. ఇందులో ఒకటి మహేష్ కోసం సిద్దం చేసిందేనట. మహేష్ చాలా కాలం నుండి మణిరత్నం సినిమాలో నటించాలని అనుకుంటున్నాడు. పొన్నియన్ సెల్వన్ అనే తమిళ నవల లైన్ మహేష్ కు వినిపించినట్లు, ప్రాధమికంగా ఓకె అనుకున్నట్లు తెలిసింది.

ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో నటించి ఓ ప్రయోగం చేసి పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేక పోయిన ప్రిన్స్ ఇప్పుడు అసలే ఏ మాత్రం ఫాంలో లేని మణిరత్నంతో సినిమా చేయాలనుకోవడం పెద్ద ప్రయోగమే అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles