Bangkok brahmanandam in three role

Bangkok Brahmanandam, Bangkok Brahmanandam movie, Brahmanandam and Satya Krishna, Bangkok Brahmanandam Movie Pics Photos, Bangkok Brahmanandam Movie stills, Bangkok Brahmanandam Movie wallpapers

Brahmmi bangkok brahmanandam in three roles.

మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు

Posted: 01/02/2014 01:29 PM IST
Bangkok brahmanandam in three role

టాలీవుఢ్ లో హాస్య బ్రహ్మగా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం కేవలం కమేడియన్ గా మాత్రమే అందరికి తెలుసు. ఎప్పుడు కమేడియన్ పాత్రలు చేసి బోర్ కొట్టినట్లు ఉంది అందుకే హీరోగా ట్రై చేస్తున్నాడు. ఆ మధ్యన కమేడియన్, కమ్ రైటర్ అయిన వెన్నెల కిషోర్ దర్శకత్వంలో  ‘జఫ్పా ’ సినిమాలో హీరోగా నటించి అలరించాడు.

ఇఫ్పుడు మరో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. బ్రహ్మీ పోషిస్తుంది ఒకే రోల్ కాదండోయ్. మూడు. సాధారణంగానే బ్రహ్మీ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడు. అలాంటిది ఒకే సినిమాలో మూడు పాత్రల్లో కనిపిస్తే... థియేటర్లో నవ్వులే నవ్వులు. ప్రస్తుతం ఆయన ‘అందాల రాముడు ’ సినిమాను తెరకెక్కించిన లక్ష్మీనారాయణ (దీప్తి) దర్శకత్వంలో ‘బ్యాంకాక్ బ్రహ్మానందం ’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

పెళ్లిళ్లలో సన్నాయి వాయించేవాడిగా ఒక పాత్ర ... సంగీతం మాస్టారిగా మరో పాత్ర ... పాప్ సింగర్ గా ఇంకో పాత్ర ... ఇలా మూడు పాత్రల్లో ఈ సినిమాలో  కనిపించబోతున్నాడని దర్శకుడు దీప్తి చెప్పుకొచ్చాడు. ‘అందాల రాముడు ’ సినిమా కన్నా పెద్ద విజయాన్ని ఇది సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు  దర్శకుడు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles