Chiru and pawan are guests for rey audio

Chiru and Pawan, Pawan guest Rey Audio Function, Guest Pawan Kalyan, Rey Audio Launch Guest, Rey Audio Launch , Rey Audio Release

Pawan Kalyan was invited for Rey audio function as the chief guest for the event. Director YVS Chowdary is utilizing Pawan name and fame as much as he can for Rey movie promotions.

మెగా హీరోలు ముగ్గురు ఒకే వేదిక పై ?

Posted: 01/02/2014 09:09 AM IST
Chiru and pawan are guests for rey audio

మెగా ఫ్యామిలీ నుండి వెండి తెరకు సాయిధరమ్ తేజ్ ‘రేయ్ ’ సినిమా ద్వారా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తూ, నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కొన్ని ఆర్థిక కారణాల వల్ల జాప్యం అయింది.

ఎట్టకేలకు అన్నింటిని అధిగమించి ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావడానికి వైవీఎస్ నడుం బిగించాడు. ఇందులో భాగంగానే ఈనెల 5వ తేదీన ఈ సినిమా ఆడియోను ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. చిరంజీవి మేనల్లుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్న సాయిధరమ్ తేజ్ ను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఈ ఆడియోకు పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు సమాచారం.

మెగా ఫ్యామిలీకి చౌదరికి మంచి సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో వారిని ఈ వేడుకకు పిలిచి సినిమాకు పబ్లిసిటీ కల్పించాలని భావించి పవన్ ని ఆహ్వానిస్తే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఫిలింనగర్ టాక్. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవిని, నాగబాబును కూడా ఆడియోకు రమ్మని ఆహ్వానించాడని, ఇంకా వారి నుండి ఎటువంటి సమాచారమ్ రాలేదని వారిద్దరు మెగా అభిమానుల కోసం వస్తారనే నమ్మకంతో ఉన్నాడు చౌదరి.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 5న రిలీజ్ చేయడానికి చిత్ర దర్శక నిర్మాత వైవీయస్ చౌదరి సన్నాహాలు చేస్తున్నాడు. ఒకవేళ చిరు, నాగబాబు కూడా వస్తే మెగా ఫ్యాన్స్ కి పండగే అన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles