Director rajamouli denies approaching pranitha

Director Rajamouli Denies Approaching Pranitha, Rajamouli clears air about Pranitha in Baahubali, rajamouli denies pranitha in baahubali, rajamouli about pranitha in baahubali

Director SS Rajamouli slammed the reports that he approached actress Pranitha Subhash for female lead opposite actor Prabhas in his Telugu movie Baahubali.

ప్రణీత పై అన్నీ పుకార్లే....

Posted: 11/12/2013 11:58 AM IST
Director rajamouli denies approaching pranitha

అప్పుడెప్పుడో వెండితెరకు ‘మరదలు పిల్ల ’ గా పరిచయం అయిన ప్రణీతకు ఇటీవలే  ‘అత్తారింటికి దారేది ’ సినిమా మంచి నేము, ఫేము తీసుకురావడంతో ఈమెకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘బహుబలి ’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడనే వార్తలు ఫిలింనగర్ లో వినిపించాయి.

ఇలాంటి గాలి వార్తలకు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో స్పందించే రాజమౌళి ఈసారి కూడా స్పందించి రూమర్లకు పుల్ స్టాప్ పెట్టాడు. ‘బాహుబలి’ కోసం ప్రణీతను ఎంపిక చేసుకున్నామన్న వార్తల్లో నిజం లేదని, తన చిత్రంలో ఆమె నటించడంలేదని రాజమౌళి స్పష్టం చేశాడు. ప్రణీతను తానేమీ సంప్రదించలేదని, ఒకవేళ అదే జరిగితే తాను ఆ విషయాన్ని తెలియజేస్తానని మౌళి అంటున్నారు.

ఈ సినిమా కోసం రాజమౌళి భారీ తారాగణాన్ని ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. ప్రధాన పాత్రల్లో ప్రభాస్, రాణా, అనుష్కలు నటిస్తున్నారు. వీరి సరసన ప్రణీత కూడా చేరిందనే  వార్తలు రావడంతో మరదల పిల్ల దశ తిరిగినట్లే అనుకున్నారు సినీ జనాలు. కానీ రాజమౌళి క్లారిటీ ఇవ్వడంతో ఈమె ఫ్యాన్స్ ఊసురుమన్నారు. ఇక ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కేరళలో జరుపుకుంటుంది. చూద్దాం ఇంకెంత మంది హీరోయిన్స్ పై ఇలాంటి పుకార్లు వస్తాయో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles