Singer geetha madhuri with nandu engagement

Singer Geetha Madhuri with Nandu engagement, geetha madhuri singer marriage, eetha Madhuri Husband Photos, Geetha Madhuri with Her Hunsband pics, Geetha Madhuri engagement photos, Geetha Madhuri marriage pics, Nandu And Lovely Geetha Madhuri

Singer Geetha Madhuri with Nandu engagement

గీతామాధురి లవ్ 100% సక్సెస్

Posted: 11/12/2013 10:28 AM IST
Singer geetha madhuri with nandu engagement

గాయని గీతామాధురి గురించి అందరి తెలిసిందే. అయితే గీతా గత రెండు సంవత్సరాల నుండి నటుడు నందుతో నడుపుతున్న ప్రేమ విషయం తెలిసిందే. ఈ ఇద్దరు వారి పెద్దల అంగీకారం కోసం ఇన్ని రోజులు ఆగినట్లు సమాచారం. ఇరువైపుల పెద్దలు వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో.. సోమవారం హైదరాబాద్ లో గీతామాధురి , నటుడు నందుల నిశ్చితార్థం జరిగింది. అయితే అది కొద్ది మంది మద్యనే నిశ్చితార్థం జరిగినట్లు టాలీవుడ్ టాక్.

 

ఇక అతి త్వరలో గీతా నందుల పెళ్లి ఉంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే పెళ్లి వేడుక మాత్రం చాలా గ్రాండ్ గా చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లు సమాచారం. గీతామాధురి తన లవ్ సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా కనబడుతుంది. నటుడు నందు కూడా గీతామాధురి కోసం రెండు సంవత్సరాలు వేయిట్ చేసి, చివరకు ఇరు పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని అంటున్నారు.

 

ఫొటో’ సినిమాతో హీరోగా పరిచయమైన నందు ‘100% లవ్’లో కీలకపాత్ర పోషించారు. ఓ లఘుచిత్రంలో కలిసి నటించిన సందర్భంలో వీరిరువురి మధ్య ప్రేమ చిగురించింది. ఇరువైపుల పెద్దలు ఈ ప్రేమకు అంగీకారం తెలిపారు. ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగనుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles