Mahesh babu dates for rudrama devi

Mahesh Babu Dates for Rudrama Devi, Super Star Mahesh Babu playing important role, Mahesh Babu as Gona ganna reddy,Gona Ganna Reddy, Rudrama Devi movie

Mahesh Babu Dates for Rudrama Devi - If a latest grapevine is to be believed, Super Star Mahesh Babu will be playing an important role of Gona Ganna Reddy

మహేష్ డేట్స్ ఇచ్చేశాడు

Posted: 11/12/2013 04:40 PM IST
Mahesh babu dates for rudrama devi

టాలీవుడ్ దర్శకులు సినిమాలకు హైప్ తీసుకొని రావడానికి స్టార్ హీరోలతో గెస్ట్ రోల్స్ పోషింపజేయడం చాలా సర్వసాదారణం అయిపోయింది. కొంత మంది హీరోలు భారీ రెమ్యునరేషన్ తీసుకొని నటిస్తుంటే, మరికొంత మంది హీరోలు సదరు దర్శకుడితో ఉన్న సాన్నిహిత్యంతో సినిమాల్లో నటించేస్తున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు కూడా అదే చేస్తున్నాడు.

గతంలో ఈయనకు భారీ హిట్ అందించిన గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘రాణి రుద్రమ ’ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రను పోషించబోతున్నాడు. ఈయన ఈ పాత్రలో కనిపించబోతున్నాడని గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నా... తాజాగా దీనికి సంబంధించి డేట్స్ కూడా ఇచ్చాడని అంటున్నారు. మహేష్ కూడా చాలా కాలంగా చారిత్రాత్మక పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాడు.

ఇలాంటి పాత్రలు  పోషించే అవకాశం కెరీర్లో అరుదుగా వస్తుంది కాబట్టి, మహేష్ ఈ పాత్ర చేయడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. డిసెంబర్లో ఈ సినిమా షూటింగులో పాల్గొనడానికి అంటున్నారు. ఇప్పటికే అనుష్కకు సంబంధించిన ఫస్ట్ లుక్ కి విపరీతమైన క్రేజ్ రావడం, ఇందులో మహేష్ నటిస్తుండం, భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles