Soundarya rajinikanth rejects deepika voice for kochadaiyaan

Soundarya Rajinikanth rejects deepika voice for kochadaiyaan, deepika padukone,Rajinikanth,Kochadaiiyaan,Kochadaiiyaan release,Kochadaiiyaan telugu,vikrama simha,deepika dubbing

Soundarya Rajinikanth rejects deepika voice for kochadaiyaan, deepika padukone,Rajinikanth,Kochadaiiyaan,Kochadaiiyaan release,Kochadaiiyaan telugu,vikrama simha,deepika dubbing

దీపికాను ప్రక్కన పెట్టిన సౌందర్య

Posted: 10/09/2013 06:31 PM IST
Soundarya rajinikanth rejects deepika voice for kochadaiyaan

 

బాలీవుడ్ నటి దీపికా పదుకునె ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ‘కొచ్చాడయాన్ ’ సినిమాలో రజినీకాంత్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నిర్మాణంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. అయితే ఉన్నట్లుండి ఈ సినిమా దర్శక నిర్మాత అయిన సౌందర్య రజినీకాంత్ దీపికాను ప్రక్కన పెట్టినట్లు తాజా సమాచారం. అంతా అయ్యాక ఇప్పుడు ప్రక్కన పెట్టడం ఏంటని ఆశ్చర్యపోకండి. విషయం ఏంటంటే ప్రస్తుతం సినిమా డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఇందులో దీపికా పాత్రకు ఆమె చేతనే డబ్బింగ్ చెప్పించాలని భావించింది సౌందర్య. దీపికా కూడా రెడీ అంది. కానీ చివరి నిమిషంలో సౌందర్య దీపికాను తప్పించి డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ స‌విత రెడ్డిను సెల‌క్ట్ చేసుకున్నారు.

కారణం ఏంటంటే... రజినీకాంత్ సరసన అవకాశం ఇస్తున్నందుకు రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా ముక్కు పిండి మూడు కోట్లు వసూలు చేసిందట. దీపికా అంత రెమ్యురేష‌న్ తీసుకునే స‌రికి, సౌత్ ఇండ‌స్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండ‌స్ట్రీ కూడ అవాక్కయింది. ఇప్పుడు సొంతగా డబ్బింగ్ చెప్పమంటే మళ్ళీ ఎంత అడుగుతుందో అని దీపికాను పక్కన పెట్టిందని అంటున్నారు ఆ చిత్ర యూనిట్ వారు. మరి పెద్ద స్టార్స్ ప్రక్కన నటిస్తే పేరొస్తుందని రెమ్యునరేషన్ కాస్త తగ్గించుకుంటే ఏమౌతుందని, కాసులకు కక్కుర్తి పడితే ఇలాంటి అవకాశాలు చేజారక ఏం చేస్తాయని సినీ జనాలు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles