Sridevi in a film penned by kona venkat

writer Kona Venkat,sridevi boney kapoor,Sridevi,Kona Venkat,actress sridevi, kona venkat, comments in social networking site, sridevi husband bonikapoor

Sridevi will be acting in a film penned by Tollywood writer Kona Venkat.

అతిలోక సుందరితో కోన వెంకట్

Posted: 09/18/2013 09:59 AM IST
Sridevi in a film penned by kona venkat

ఒకప్పుడు వెండితెరను ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి చాలా గ్యాప్ తరువాత ఆ మధ్య బాలీవుడ్ లో ఇంగ్లీష్ వింగ్లీష్ ద్వారా రీఎంట్రీ ఇచ్చి అందర్ని అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ అమ్మడు తెలుగు లో అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. టాలీవుడ్ పలు హిట్ సినిమాలకు మంచి స్ర్కిప్ట్ ఇచ్చి, మంచి రైటర్ గా పేరు తెచ్చుకున్న కోన వెంకట్ త్వరలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన అతిలోక సుందరితో ఓ సినిమాను ప్లాన్ చేసినట్లు సోషల్ మీడియా నెట్ వర్కింగ్ ద్వారా తెలియజేశాడు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ సినిమాను మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో శ్రీదేవి భర్త భోనీ కపూర్ నిర్మించబోతున్నాడని, దీనికి సంబంధించిన కథాచర్చలు కూడా దాదాపు పూర్తయ్యానని, ఇటీవలే శ్రీదేవిని కలిసిన వెంకట్ తన స్టోరీని వినిపించడం, అందుకు ఆమె అంగీకరించడం జరిగిపోయాయట. ఇక దీనికి సంబంధించిన తారాగణం, మిగతా వారి వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పాడు. తెలుగు తెర పై అతిలోక సుందరి కనిపించబోతుందనే వార్త ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles