Rajamouli baahubali is old film remake

prabhas,rana,anushka,bahubali,prabhas bahubali,ss rajamouli,rajamouli bahubali,ntr,jayasimha,ntr jayasimha,

Buzz is Bahubali is the remake of yesteryear NTR superhit starrer Jayasimha. The film which came in 1955 starred NTR as Jayasimha.

ఎన్టీఆర్ సినిమాకు కాపీనా ?

Posted: 08/27/2013 04:29 PM IST
Rajamouli baahubali is old film remake

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బహుబలి సినిమా పై రోజుకో రూమర్ బయటకు వస్తుంది. ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది పెద్ద సెన్సేషన్ అవుతుంది. రాజమౌళి ఏ సినిమా తీసినా అది హాలీవుడ్ సినిమా నుండే కాపీ చేశాడనే వార్తలు రావడం సహజం అయింది. ఆ మధ్య వచ్చిన ‘ఈగ ’ సినిమా కూడా హాలీవుడ్  సినిమాకే కాపీ అన్నారు. కానీ రాజమౌళి ఏది ఒక సినిమా నుండి ఇన్మిరేషన్ పొందాడు కానీ దానిని కాపీ కొట్టలేదు. దానిని ఆధారంచే చేసుకొని మన నేటివిటీకి అనుగుణంగా తీసి సంచలన విజయం సాధించాడు. ఇప్పుడు దర్శకత్వం వహిస్తున్న ‘బహుబలి ’ సినిమా హాలీవుడ్ సినిమా నుండి కాకుండా టాలీవుడ్ పెద్దన్న ఎన్టీఆర్ నటించిన సినిమాకు కాపీ అనే ప్రచారం మొదలైంది. ఈ చిత్ర కథ ఎన్టీఆర్  సూపర్ హిట్ సినిమా ‘జయసింహా ’లోని పాయింట్ ఆధారంగా తెరెకెక్కుతుందని అంటున్నారు. ఆ సినిమాలో ఎన్‌టీఆర్ చిన్నాన్న పాత్ర ఎస్‌వి రంగారావు విలన్ అయితే రంగారావు కొడుకు పాత్రలో కాంతారావు, ఎన్‌టీఆర్ వెంటే ఉండే పాత్రలో నటించారు. ఇపుడా కాంతారావు పాత్రనే విలన్‌ను చేసి రానా‌తో చేస్తున్నట్టు ఫిలింనగర్ వర్గాల  సమాచారం. అయినా రాజమౌళి ఏ పాయింట్ ని ఆధారంగా చేసుకున్నా కానీ ఆ కథను, కథనాన్ని ఇప్పటి ప్రేక్షకులను అనుగుణంగా తీయడంలో దిట్ట. ఇలా రాజమౌళి పై ఎన్ని రూమర్లు వచ్చినా అది పబ్లిసిటీ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఇమేజ్ ని డ్యామేజ్ చేయలేదని అంటున్నారు కొందరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles