Jr ntr ramaiya vastavaiya audio launch sept 8

Jr NTR Ramaiya Vastavaiya Audio Launch Sept 8, Ramayya Vasthavayya is an upcoming telugu movie , Jr. NTR, Samantha and Shruti Haasan

Jr NTR Ramaiya Vastavaiya Audio Launch Sept 8, Ramayya Vasthavayya is an upcoming telugu movie , Jr. NTR, Samantha and Shruti Haasan

వెనక్కి తగ్గేది లేదంటున్న ఎన్టీఆర్

Posted: 08/27/2013 06:33 PM IST
Jr ntr ramaiya vastavaiya audio launch sept 8

సీమాంధ్ర లో ఉద్యమ దెబ్బకు మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ వణికి పోతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఈ సెగ బాగా తగులుతుంది. ఈ దెబ్బతో సినిమాలే కాకుండా ఆడియో ఫంక్షన్లు కూడా జరుపుకోవడం లేదు. ఇప్పటికే తుఫాన్ ఆడియో వేడుకను జరపడానికి భయపడుతున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా ’ మాత్రం ఆడియో విషయంలో కానీ, సినిమా విడుదల విషయంలో కానీ ఏ మాత్రం వెనక్కి తగ్గనంటుంది. ఈ సినిమా ఆడియోను సెప్టెంబర్ 8వ తేదీన శిల్పాకళా వేదికలో అభిమానుల మధ్య జరిగితీరుతుందని అంటున్నారు ఆ చిత్ర దర్శక, నిర్మాతలు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాను కూడా సీమాంధ్రలో అడ్డుకుంటామని హెచ్చరించడంతో ఆడియో, సినిమా విడుదల పై సందేహాలు నెలకోవడంతో హరీశ్ శంకర్ స్పందించి ఎట్టి పరిస్థితుల్లో సినిమాను ప్రకటించిన తేదీనే విడుదల చేస్తామని, ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశాడు. గతంలో నిర్మాత దిల్ రాజు కూడా ఎవడు సినిమా విషయంలో ఇలానే చెప్పి, తీరా దసరాకు వాయిదా వేశాడు. ఈ సినిమా నిర్మాత కూడా దిల్ రాజే. మరి దీన్ని ఎప్పటికి పోస్ట్ పోన్ చేస్తాడో  చూడాలి ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles